Varalaxmi Sarath Kumar : వామ్మో.. ఆ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్.. వద్దంటున్న ఫ్యాన్స్?
TeluguStop.com
మామూలుగా కొంతమంది నటీనటులు ఒక్కొక్కసారి షాకింగ్ నిర్ణయం తీసుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు.ముఖ్యంగా సినిమాల విషయంలో, పాత్రల విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకుంటారు.
కొంతమంది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మాత్రం చేస్తుంటే మరి కొంతమంది సొంత ఆలోచనలతో వచ్చిన పాత్రలు ఎలా ఉన్నా సరే అని చేసుకుంటూ పోతారు.
ముఖ్యంగా ఒక హోదాలో ఉన్న నటీనటులు మాత్రం ఎప్పుడు ఒకే పాత్ర కాకుండా కొత్తగా ఏదైనా పాత్ర వస్తే చేయటానికి బాగా ఆలోచిస్తారు.
కానీ వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarath Kumar ) తాజాగా రూట్ మార్చేసింది.
తను ఒక పాత్రలో చేయటానికి సిద్ధమవుటంతో ఫ్యాన్స్ అసలు ఒప్పుకోవడం లేదు.ఇంతకు ఆ పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
హీరోయిన్ క్యారెక్టర్ కంటే నెగిటివ్ రోల్( Negative Role ) లో మంచి పేరు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.
వారసత్వంగా వరలక్ష్మి ఇండస్ట్రీకి అడుగుపెట్టగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.తన నటనకు ఉత్తమనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.
2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.
2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.
ఇక వీరసింహారెడ్డి సినిమా( Veerasimha Reddy )లో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. """/"/
తెలుగు ప్రేక్షకులను కూడా తన ఫాలోవర్స్ గా మార్చుకుంది.
అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.అయితే తాజాగా తను ఓ సినిమాలో స్టార్ హీరోకు తల్లిగా నటించడానికి సిద్ధమైందని తెలిసింది.
"""/"/
ఆ స్టార్ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్( Star Hero Dhanush ).
సార్ సినిమా తర్వాత ప్రస్తుతం మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.
అయితే ఈ సినిమాలో ధనుష్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని తల్లిగా నటించమని డైరెక్టర్ చెప్పటంతో.
వెంటనే వరలక్ష్మి సినిమా స్టోరీ బాగుండటంతో తల్లి పాత్రకు ఒప్పుకుందని తెలుస్తుంది.ఇక ఈ విషయం అభిమానులకు తెలియడంతో ఇంతకాలం లేడీ విలన్ గా చేసి ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తావ్ ఏంటి అంటూ.
నీకు అటువంటి పాత్రలు సెట్ కావని అంటున్నారు.
పంచదార కాదు బాస్.. బెల్లం టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!