రేపే వరలక్ష్మి వ్రతం.. వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, ముహూర్తం..!

హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం ఒకటి.శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.

శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడంవల్ల సకల సంపదలు కలుగుతాయని, భావించడం వల్ల శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

మరి ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది? వరలక్ష్మీ వ్రతం పూజా విధానం? వరలక్ష్మీ వ్రతం చేయడానికి ముహూర్తం ఎప్పుడు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 20వ తేదీ వచ్చింది.ఎంతో నిష్టతో అమ్మవారికి చేసే ఈ పూజ సరైన సమయంలో చేయటం వల్ల అమ్మ వారి ఆశీస్సులు మనపై ఉండి సర్వ సంపదలు కలుగుతాయి.

మరి వరలక్ష్మీ వ్రతం చేయడానికి సరైన ముహూర్తం ఎప్పుడు అనే విషయానికి వస్తే.

సింహ లగ్నంలో వరలక్ష్మీ వ్రతం చేయడానికి సరైన సమయం ఉదయం 6.08 నుంచి 08.

01 వరకు ఎంతో శుభ ముహూర్తం.వృషభ లగ్నంలో వరలక్ష్మి పూజ చేయడానికి 12.

09 నుంచి 2.20 వరకు ఎంతో అనువైనది.

పొరపాటున కూడా వరలక్ష్మీ వ్రతాన్ని రాహుకాలంలో చేయకూడదు. """/"/ శుక్రవారం ఉదయమే నిద్రలేచి తలంటు స్నానం చేస్తే మహిళలు దేవుని గదిలో అమ్మవారి పీఠంపై బియ్యపు పిండితో పద్మం ముగ్గు వేసే ఆపై కలశం పెట్టి అమ్మవారికి వివిధ రకాలుగా అలంకరించి వరలక్ష్మీ వ్రతం చేస్తారు.

వరలక్ష్మీ వ్రతం చేయడానికి ముందుగా గణపతి పూజ చేయాలి.అలాగే వివిధ రకాల పిండివంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, వరలక్ష్మి కథను చదువుతారు.

అదేవిధంగా వరలక్ష్మీ వ్రతం చేసినవారు ఆరోజు మొత్తం ఉపవాసం ఉండాలి.అలాగే ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం వాయనంగా ఇవ్వాలి.

ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి కృపాకటాక్షాలు మనపై ఉంటాయని, అమ్మవారిని ధ్యానిస్తున్న అంత సేపు మనసు అమ్మవారి పై ఉంచి పూజ చేయడంవల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు.

ట్రిపుల్ రోల్ లో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే !