ఎల్లారెడ్డిపేట మండలంలో భక్తిశ్రద్ధలతో మహిళల వరలక్ష్మీ వ్రతాలు

మహిళా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు నివాస గృహాలు రాజన్న సిరిసిల్ల జిల్లా :శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు, పలు ఆలయాలు నివాస గృహాలు మహిళా భక్తులతో కిటకటలాడాయి.

మహిళా భక్తులు అమ్మవారి విగ్రహాలను తయారు చేసి ఇండ్లల్లో చూడ ముచ్చటగా రంగు రంగుల పూలతో పట్టు వస్ర్తాలతో అమ్మవార్లను అలంకరించి కుంకుమార్చన అమ్మవారికి ఒడి బియ్యం పోయడంతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో వరలక్ష్మీ పూజలను ఆచరించారు.

పులిహోర , సిరా ప్రసాదతో విందిచ్చారు కొందరు వారి వారి ఆర్థిక స్థోమతో కూర గాయాల బోజనతో విందులిచ్చారు.

బియ్యం, పప్పు, బెల్లంతో ప్రసాదం తయారు చేసి వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.

ముందుగా గణపతి పూజ, వరలక్ష్మీ పూజ అనంతరం నీరాజన మంత్ర పుష్పం సమర్పించారు.

పురోహితులు అభిషేకాలు అష్టోత్తర సహస్రనామావళితో కుంకుమార్చన మహిళా భక్తులతో జరిపించారు.

అనాదిగా వస్తున్న హిందూ ధర్మం ప్రకారం తోటి మహిళలను తమ ఇళ్ళకు ఆహ్వానించి వారి కాళ్లకు పసుపు నోదట కుంకుమ బొట్టు పెట్టి గౌరవంగా పాదాలకు నమస్కరిస్తారు అనంతరం వాయునం నీకిస్తినమ్మ వాయినం నేను తీసుకొంటినమ్మ అంటూ ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

దేవర సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే!