మొదలైన వరలక్ష్మి పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోస్!
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ ( Sarath Kuma R) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి వరలక్ష్మి( Varalakshmi ) శరత్ కుమార్.
కెరియర్ మొదట్లో హీరోయిన్గా పలు తమిళ సినిమాలలో నటించిన వరలక్ష్మి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇలా హీరోయిన్ పాత్రలలో తాను సక్సెస్ కాకపోవడంతో ఈమె నెగిటివ్ క్యారెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇలా లేడీ విలన్ పాత్రలలో వరలక్ష్మీ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం ఆమెకు తెలుగు తమిళ భాషలలో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో కెరియర్ పరంగా వరలక్ష్మి ఎంతో బిజీగా ఉన్నారు.
"""/" /
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే ఈమె త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.
జూలై రెండో తేదీ వరలక్ష్మి పెళ్లి ( Marriage ) చేసుకోబోతున్నారన్న సంగతి మనకు తెలిసిందే.
ఈమె ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ ( Nicolai Sach Dev ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.
"""/" /
వీరి వివాహం జులై రెండో తేదీ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైందని తెలుస్తోంది.
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదిక తన ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందులో తనకు కాబోయే భర్తను గట్టిగా ఆలింగనం చేసుకొని కనిపిస్తున్నారు.
ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముంబైలో జరిగాయని తెలుస్తుంది.ఇక ఈమె పెళ్లి వేడుకలలో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.
ఈమె కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అందరిని కూడా ఆహ్వానించారు.
అలాగే పిఎం నరేంద్ర మోడీని కూడా తన పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
పవన్ వల్ల సినిమాలకు దూరమవుతున్నాను…నటి నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!