Varalakshmi Sarath Kumar : అప్పుడే అమ్మను కావాలనుకున్నా.. కాలేకపోయానంటూ వరలక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్ ( Varalakshmi ) ఒకరు.

ఈమె తమిళ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ ని అడుగుపెట్టారు అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ రాకపోవడంతో విలక్షణ పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈమెకు 18 సంవత్సరాల వయసులోనే స్టార్ దర్శకుల సినిమాలలో నటించే అవకాశం వచ్చింది కానీ ఇంత చిన్న వయసులో హీరోయిన్గా వద్దని తన తండ్రి చెప్పడంతో ఇండస్ట్రీకి ఆలస్యంగా వచ్చానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత( Personal Life ) విషయాలను వెల్లడించారు.

"""/" / ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం కానీ లేదంటే వృత్తిపరమైన జీవితం కానీ ప్లాన్ చేసుకున్న ప్రకారం జరగలేదని తెలిపారు.

తాను పోడా పోడి సినిమాలో నటించే సమయంలో తనకు 22 సంవత్సరాల వయసు అని తెలిపారు.

28 సంవత్సరాలకు స్టార్ హీరోయిన్గా కొనసాగి 32 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుని 34 సంవత్సరాల వయసులోనే అమ్మను కావాలి అనుకున్నాను.

కానీ నేను అనుకున్న ప్రకారం ఏది జరగలేదని తెలియజేశారు.ఇప్పుడు నా వయసు 38 అంటూ ఈమె వెల్లడించారు.

"""/" / తన మొదటి సినిమా తర్వాత నేను సినిమాలపై ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదని అలా కాదని తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ ఈమె వెల్లడించారు.

ఇక ఈమె ప్రస్తుతం ముంబైకి చెందినటువంటి ఒక ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్నటువంటి నికోలయ్ సచ్ దేవ్ (Nikolai Sach Dev) అనే వ్యక్తితో 14 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయనతో ప్రేమలో పడిన ఈమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

ఇప్పటికే వీరిద్దరిని నిశ్చితార్థం ( Engagment ) జరిగిన సంఘటన తెలుస్తుంది.ఇక ఈయనకి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.

     .

మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?