Varalaxmi Sarathkumar : వరలక్ష్మి చేసుకోబోయే వ్యక్తికి ఇది రెండో పెళ్ళా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు?
TeluguStop.com
తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి అనంతరం విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalakshmi Sarath Kumar ) ఒకరు.
ఈమె తమిళంలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించారు.అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నెగిటివ్ పాత్రలలో నటించారు.
ఇలా విలన్ క్యారెక్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా సెట్ అయ్యారు.
దీంతో ఈమెకు అన్ని విలన్ క్యారెక్టర్ లలో నటించే అవకాశం వస్తుంది. """/" /
ఇలా కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు.
అయితే గతంలో ఈమె హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందినటువంటి నికోలయ్ సచ్ దేవ్ ( Nikolie Sach Dev ) అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
వీరిని నిశ్చితార్థం ముంబైలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.ఇక వీరిద్దరికి దాదాపు 14 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని తెలుస్తుంది.
"""/" /
ఇకపోతే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోయే నికోలయ్ సచ్ దేవ్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
ఈయనకు ఇది మొదటి వివాహం కాదని ఇదివరకే పెళ్లి జరిగి తన భార్యతో విడిపోయిన అనంతరం వరలక్ష్మితో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
నికోలయ్ భార్య కవిత( Kavitha ) సచ్ దేవ్.ఆమె ఒక మోడల్.
ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతోంది.వీరిద్దరికి విబేధాల వలన విడాకులు అయ్యినట్లు సమాచారం.
ఇలా తన మొదటి భార్యతో విడిపోయిన అనంతరం ఈయనకు వరలక్ష్మి పరిచయం అయ్యారని ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు.
ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు అదేంటి వరలక్ష్మి ఇలా పెళ్లి అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అఖండ సీక్వెల్ లో బాలయ్య పాత్ర ఇదే.. బాలయ్య నట విశ్వరూపం చూడబోతున్నామా?