సాధారణంగా మనం వినాయకుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు వంటి ఆలయాలను దర్శించుకుని ఉంటాము.కానీ వరాహ స్వామి ఆలయాలను ఎప్పుడైనా దర్శించుకున్నారా? కనీసం అలాంటి ఆలయాలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియక పోవచ్చు.
వరాహస్వామి ఆలయం అంటే సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు ఆలయాలని చెప్పవచ్చు.విష్ణుమూర్తి లోక సంరక్షణార్థం దశావతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసినదే.
ఇందులో మూడవ అవతారమైన వరాహ అవతారం గురించి అందరికీ తెలుసు.వరాహ అవతారం ఎత్తి సముద్ర గర్భంలో కలిసిపోతున్న భూమండలాన్ని తన కోరలతో రక్షించారని మన పురాణాలు చెబుతున్నాయి.
దశావతారంలో మూడవ అవతారము వరాహ అవతారం.మహాలక్ష్మిని సంబోధించే శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని స్వామి వారిని పూజిస్తుంటారు.
అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వరాహావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి.
అయితే వాటిలో పేరుగాంచిన వాటిలో ఒకటి తిరుమల, రెండవది కరీంనగర్ జిల్లా కమానపూర్ గ్రామంలో ఒక బండరాయిపై స్వామివారు వెలిశారని స్థలపురాణాలు చెబుతున్నాయి.
"""/" /
పురాణాల ప్రకారం దాదాపు 600 సంవత్సరాల క్రితం ఓ మహర్షి ఈ స్థలంలో స్వామివారి అనుగ్రహం కోసం తపస్సు చేశారు.
ఘోర తపస్సు అనంతరం ఆ మహర్షికి స్వామివారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అందుకు ఆ మహర్షి ఎల్లప్పుడూ ఎవరికి ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతూ ఇక్కడే కొలువై ఉండమని అడగడం వల్ల స్వామి వారు బండపై వెలిసినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.
ఈ బండరాయి పక్కనే స్వామి వారి పాదాల అడుగులు కూడా కనబడుతుంటాయి.కానీ ఈ ప్రదేశంలో స్వామి వారికి ఎలాంటి ఆలయం గాని ,గోపురం గాని లేదు.
కేవలం ఈ బండ పై ఉన్న స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025