కేసు కొట్టేసిన వరాహ రూపం ఇక కాంతారా చిత్రంలో ఎక్కడ కనిపించదు
TeluguStop.com
చాలామంది కాంతారా సినిమా ఓటిటి లోకి వస్తుంది అని తెలియగానే పండగ చేసుకున్నారు.
కానీ సినిమా చూశాక అందరి ఆసక్తి ఆవిరై పోయింది.ఎందుకంటే ప్రాణం లేని సినిమాగా క్లైమాక్స్ లో వరాహ రూపం లేని చిత్రం దర్శనమిచ్చింది.
దాంతో మొండెం లేని శరీరం లాగ ఆ సినిమాకి ఆయువు లేకుండా ప్రసారం అవుతుంది.
దానికి వస్తున్న వ్యూస్లె మరియు ఆ లెక్కల సంగతి పక్కన పెడితే ఆ చిత్రానికి ప్రస్తుతం ప్రాణం లేదని చెప్పాలి.
ఇక ఈ వరాహ రూపం పాట ఎత్తివేయడానికి గల కారణం మనందరికీ తెలిసిందే.
మలయాళ మ్యూజిక్ కంపెనీ అయినా థైకుడుం బ్రిడ్జి కాంతారా సినిమాపై కేసు వేయడం.
అయితే ఎప్పుడైతే క్రింది కోర్ట్ ఆ కేసును టేకప్ చేసిందో అప్పుడే స్టే విధించింది.
అప్పటినుంచి ఆ పాట లేకుండానే విధి లేని స్థితిలో కాంతారా సినిమా ప్రసారమవుతోంది.
పోనీ హైకోర్టుకు వెళ్దామా అంటే హైకోర్టు వారు ఈ కేసును టేకప్ చేయలేదు.
ఆ తర్వాత క్రింది కోర్ట్ కేసు లో సదరు మ్యూజిక్ కంపెనీ గెలిచింది.
దాంతో ఆ పాటని ఎక్కడా కూడా వాడుకోవద్దు అంటూ మొదట తీర్పు వెల్లడించింది.
ఆ తర్వాత మళ్లీ ఎక్కడైనా వాడుకోవచ్చు అంటే కూడా తెలిపింది.ప్రస్తుతం కేస్ అయితే గెలిచారు కానీ వరాహ రూపం పాటను సినిమాలో పెట్టేస్తారు అని అందరూ భావిస్తున్నారు.
కానీ ఆ పని ఇప్పట్లో జరిగేలా లేదు.ఎందుకంటే ఇదే పాట పై పాలక్కడ్ కోర్టు లో కూడా కేసు నడుస్తుంది.
"""/"/
అక్కడ కోర్టు కూడా స్టే విధించింది.ఒకవేళ ఆ కేసును కూడా కొట్టేస్తే పాటను సినిమాలో పెట్టుకోవచ్చు.
ఇక ఎవరైనా కర్నాటిక్ సంగీతం బేస్ చేసుకొని ట్యూన్స్ కడతారు.అసలు థైకుడుం బ్రిడ్జి వారి నవరసం మరియు కాంతారా సినిమాలోని వరాహ రూపం లో ఎక్కడ కూడా పోలికలు లేవు.
కేవలం వరాహ రూపం పాటలో వాడిన వాయిద్యం మాత్రం అక్కడక్కడ ఒకేలా వినిపిస్తుంది.
ఇంత చిన్న మాత్రానికే ఆ పాటను మొత్తంగా కిల్ చేసారు.ఇదే తరహా కేసులు అనేక చోట్ల నమోదు చేసి ఆ పాట కి, కాంతారా సినిమాకు నష్టం కలిగించే విధంగా సదరు కంపెనీ పావులు కదపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?