నేను ఎవరికి భయపడే టైపు కాదు : వనిత విజయ్ కుమార్ కూతురు
TeluguStop.com
సోషల్ మీడియా( Social Media ) పూర్తిగా విచ్చలవిడిగా తయారయింది.ఒక రాక్షస రూపం దాల్చి ఏ విధంగానైనా ట్రోల్ చేసి చాలామంది సెలబ్రిటీస్ లైఫ్ లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది.
ఉదాహరణకు తమిళ స్టార్ నటీనటుల బిడ్డ అయినా వనిత విజయ్ కుమార్( Vanitha Vijaya Kumar ) గురించి మాట్లాడుకుంటే ఆమె కూతురు జోవికా కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది.
గత బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని పరవాలేదు అనిపించుకుంది.అయితే జోవికా పూర్తిగా స్టార్ కిడ్ అనే పేరుతో ఎక్కువ ట్రోలింగ్ కి గురైంది.
అయినా కూడా దేనికి భయపడే టైప్ కాదు ఈ అమ్మ కూతుర్లు. """/"/
ఎలాంటి ఈ సమస్య నైనా సరే వారి విల్ పవర్ తో ఎదుర్కొంటారు.
వనిత సైతం మూడు వివాహాలు( Three Marriages ) చేసుకుని అన్ని విధాలుగా ఫెయిల్ అయి మళ్ళీ కెరియర్ నిలబెట్టుకుంది.
ఇప్పుడు ఆమె కూతురు జోవికా( Jovika ) కెరియర్ మొదటి నుంచి పరిస్థితులను చక్కదిద్దుకుంటుంది.
ఆమె నెగెటివిటీని బాగానే పేస్ చేస్తుంది.అలాంటి వాటికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీడియా ముఖంగా చెబుతుంది.
తాను ఎవరిని మోసం చేయడం లేదు, ఎవరి డబ్బులు లాక్కోవడం లేదు, కేవలం నా రక్తం లోనే నటన ఉంది, నా తల్లి, నా అమ్మమ్మ , నా తాతయ్య ,నా పిన్ని అందరూ నటులే.
అందువల్ల నాకు ఒక అవకాశం ఎక్కువ దొరకొచ్చు కానీ అంతకన్నా నాకు టాలెంట్ లేకుండా ఎక్కువ రోజులు భరించలేదు కదా.
"""/"/
అందుకే ఈ నెగెటివిటీ( Negativity )ని నేను అసలు పట్టించుకోను.నా గురించి నాకు బాగా తెలుసు.
నా తల్లి నన్ను చాలా చక్కగా పెంచింది.నేను ఇకపై పూర్తి కెరియర్ పైనే ఫోకస్ చేయబోతున్నాను.
చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను అన్న బాధ లేదు.ఎందుకంటే నాకు సపోర్ట్ గా నా తల్లి ఉంది.
చాలామంది నా తల్లి వల్లే నా జీవితం పాడవుతుంది అంటున్నారు.కానీ ఇవన్నీ శుద్ధ దండగ మాటలు.
మా అమ్మని నన్ను ఇద్దరినీ కలిపి ట్రోల్( Troll ) చేస్తున్నారు.అయినా నేను భయపడను అంటూ గట్టిగానే సవాల్ విసురుతుంది.
మరో మూవీని మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్.. ఈ హీరోయిన్ వెళ్తున్న రూట్ రైటేనా?