నా కూతుళ్ళకు రావాల్సిన ఆస్థి రానివ్వడం లేదు : వనిత విజయ్ కుమార్
TeluguStop.com
వనితా విజయ్ కుమార్.కోలీవుడ్ లో సంచలన నటి.
సినిమాల ద్వారా సంచలనాల కన్నా.రియల్ లైఫ్ లో వివాదాలతో లైవ్ లైన్లో ఉంటుంది ఈ ముగ్గుగుమ్మ.
ఒక్క మాటలో చెప్పాలంటే వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది.అలానటి అందాల తార మంజుల, దిగ్గజ నటుడు విజయ్ కుమార్ పెద్ద బిడ్డ వనిత.
గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నది ఈ అమ్మడు.అయితే ఓ వివాదం విషయంలో పోలీసులు సైతం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.
దీన్ని బట్టి తను ఏ స్థాయిలో వివాదాలకు కారణం అవుతుందో అర్థం చేసుకోవచ్చు.
అటు తన తండ్రితోనే ఆమె పలు గొడవలు జరిగాయి.ఇంట్లో నుంచి పోలీసులను పెట్టి మరీ బయటకు గెంటించాడు ఆయన తండ్రి.
ఆ సమయంలో తాను అన్నింటికి దూరం అయినట్లు వెల్లడించింది.చేతిలో చిల్లిగవ్వ లేకుండా రోడ్డునపడ్డట్లు చెప్పింది.
ఆ సమయంలో తాను నిర్మిస్తున్న సినిమాలు సైతం ఆగిపోయినట్లు చెప్పింది.అటు తన పిల్లలకు సైతం తన తండ్రి నుంచి హక్కుగా రావాల్సిన ఆస్తి కూడా చిల్లిగవ్వ రాలేదని చెప్పింది.
అంతేకాదు.తన కుటుంబ సభ్యులు తన గురించి మాట్లాడ్డానికే ఇష్టపడరని చెప్పింది.
తను ఎప్పుడో చనిపోయిందని చెప్తారని చెప్పింది.తన తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యులు సైతం తన గురించి పట్టించుకోరని వెల్లడించింది.
"""/"/
అటు వ్యక్తిగత జీవితంలోనూ తను ఎన్నో ఒడిదుడుకులనే ఎదుర్కొందని చెప్పుకోవచ్చు.పలువురిని ప్రేమించిన ఈ అమ్మడు.
ఒకరి తర్వాత మరొకరు చొప్పున నలుగురిని పెళ్లి చేసుకుంది.అటు త్వరలో రాజకీయాల్లోకి సైతం ఆమె ప్రవేశిస్తుందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తంగా ఈ ముద్దుగుమ్మ.అటు రీల్ లైఫ్ లోనూ.
మరోవైపు రియల్ లైఫ్ లోనూ నిత్య వివాదాలే.ఈ వివాదాలతోనే ఆమె పబ్లిసిటీ పొందుతుంది.
మొత్తంగా వనిత తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో నిత్యం రచ్చ కొనసాగుతూనే ఉంటుంది.
ఇదేందయ్యా ఇది: చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?