భారత సంతతి మహిళకు కీలకపదవి..అమెరికా అటార్నీ జనరల్ గా…!!
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న బిడెన్ కరోనా కారణంగా కుదేలైన అమెరికా ఆర్ధిక స్థితిని గాడిలో పెట్టడమే తన ప్రధాన కర్తవ్యమని, కరోనా మహమ్మారిని కట్టడి చేసి ప్రజలకు సకాలంలో వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అందుకు తగ్గట్టుగానే నిపుణులైన వ్యక్తులని బిడెన్ తన టీమ్ లోకి చేర్చుకుని కీలక భాద్యతలు అప్పగిస్తున్నారు.
ఇప్పటికే బిడెన్ దాదాపు 100 మందితో కలిసి ఓ పటిష్టమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోగా అందులో అధికశాతం మహిళలు, భారతీయులు ఉండటం గమనార్హం.
ఇదిలాఉంటే
బిడెన్ తాజాగా మరో భారతీయ మహిళకు అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు.అమెరికా అటార్నీ జనరల్ గా భారత సంతతికి చెందిన న్యాయవాది వనితా గుప్తా ను నియమించారు బిడెన్.
ఆమె పేరును కేవలం ప్రకటించడమే కాదు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశారు.
బిడెన్ వనితా గుప్తా గురించి మాట్లాడుతూ.ఆమె ఎంతో గౌరవమైన మహిళ, పౌరహక్కుల కోసం పోరాటం చేసే న్యాయవాదులలో ఆమె ఎంతో గొప్ప న్యాయవాది.
స్వేచ్చా , సమానత్వం కోసం తనవంతు కృషి చేశారు.ఈ పదవిని చేపట్టడానికి ఆమె అన్ని విధాలా అర్హురాలు అని నేను బలంగా నమ్ముతున్నాను.
అందుకే ఆమెను అటార్నీ జనరల్ గా నియమిస్తున్నానని ప్రకటించారు.అంతేకాదు """/"/
ఆమె భారత్ నుంచి వచ్చిన మన కుమార్తె , మనం ఆమెను చూసి ఎంతో గర్వించాలని అన్నారు.
అయితే సెనేట్ వనితా గుప్తా అభ్యర్ధిత్వానికి ఒకే చెప్తే వనితా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసినట్టే.
అదేంటంటే అమెరికా అటార్నీ జనరల్ గా ఇప్పటి వరకూ శ్వేత జాతీయులు తప్ప వేరే ఎవరికీ ఆ అవకాశం దక్కలేదు.
ఇక వనితా గుప్తా ఒబామా సమయంలో పౌరహక్కుల విభాగానికి సంభందించి నాయకత్వం వహించారు.
శ్వేత నియామకంపట్ల భారత సంతతి సంస్థలు, ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారతీయులకు కీలక పదవులు అందివ్వడమే కాకుండా తన టీమ్ లో అత్యధిక శాతం భారతీయులకు అవకాశాలు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు.
మాపై నిందలు వేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారు.. రోజా భర్త సంచలన వ్యాఖ్యలు వైరల్!