సీనియర్ రిపోర్టర్ని చెప్పుతో కొట్టిన సీనియర్ నటి!
TeluguStop.com
అవును, మీరు విన్నది నిజమే.ఆ సీనియర్ నటి ఒక సీనియర్ న్యూస్ రిపోర్టర్ ( News Reporter )ని చెప్పుతో రెండు చెంపల మీద వాయించి కొట్టింది.
ఎంత కోపం వస్తే గాని, అంతకు తెగించి ఉండేది కాదు.మరి ఆ సీనియర్ నటి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్య పోవాల్సిందే.
పాత తరం హీరోయిన్ల విషయానికొస్తే, ముందుగా అందరికీ గుర్తొచ్చేది మహానటి సావిత్రి గారి పేరు.
ఆమె అందం అభినయం గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు.ఇక ఆమె తర్వాత హీరోయిన్ వాణిశ్రీ ( Vanishree )ఆ వరసన నిలుస్తుంది.
ఎక్కడ మనం చెప్పుకోబోయే విషయం వాణిశ్రీ గురించి అని మీకు తెలుసా? హీరోయిన్ వాణిశ్రీ దాదాపుగా సిల్వర్ స్క్రీన్ పైన పొగరుబోతు రోల్ లే పోషించేది.
అయితే నిజ జీవితంలో కూడా ఆమె అంతే వైలెంట్ గా ఉండేదని ఓ సందర్భంలో ఓ సీనియర్ నటుడు ఒక మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
ఆమె క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారట.ఎవరైనా తన ముందు తప్పు చేసినట్లయితే, సహించేవారు కాదట.
ముఖం మీద కడిగేసే వారట.ఇక ఓ సినిమా వేడుక విషయంలో సదరు సీనియర్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి తిక్క రేగిన వాణిశ్రీ గారు తన కోపాన్ని తట్టుకోలేక, ఎడంకాలు చెప్పుతీసి వెంటనే టపీ టపీమని ఆ రిపోర్టర్ లెంపలు వాయించేసారట.
"""/" /
అప్పట్లో సినిమా పరిశ్రమ చెన్నై( Chennai ) వేదికగా ఉండేది కాబట్టి, కొన్ని పత్రికలు ఆమెకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసేవట.
అందులో ఒక పత్రిక పేరు 'బొగ్గు శ్రీ'( Boggu Sree ) పత్రిక.
కేవలం హీరోయిన్ వాణిశ్రీని ఏడిపించడం కోసమే ఈ పత్రికనే నిర్వహించే వారట! ఇక వాణిశ్రీ నలుపుగా ఉండడంతోనే బొగ్గు శ్రీ అనే పేరుతో ఆ పత్రిక నడిచేదట.
అందులో వాణిశ్రీ గురించి ఇష్టం వచ్చిన రాతలు రాసే వారట. """/" /
అప్పటికే తెలుగు, తమిళం సినిమాలతో ఊపిరి సడలినంత బిజీగా ఉన్న వాణిశ్రీ కి ఆ విషయం తెలియనే లేదట.
కానీ ఒక్కగానొక్క క్షణంలో ఆమెకి ఆ విషయం తెలిసి మండిపడ్డారట! ఇక ఆరోజు రానే వచ్చింది! సదరు పత్రిక విలేకరు ఒకరు వాణిశ్రీ కి ఎదురుపడి, కోరి గెలుక్కున్నాడట.
దాంతో తిక్క రేగిన వాణిశ్రీ కోపం కట్టలు తెంచుకొని, వాడిని చడా మడా తిట్టేసి, తన కాలికొన్న చెప్పును తీసి ఎడా పెడ వాయించేసారట! ఇంకా తరువాత కాలంలో ఆ పత్రిక కనుమరుగయ్యిందని సమాచారం!.
మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెస్ట్..?