ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వంగూరి ఫౌండేషన్ ఆహ్వానం...కండిషన్స్ అప్లై..

అగ్ర రాజ్యంలో తెలుగు వారికి కొదవే లేదు, దేశ వ్యాప్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచీ అత్యధిక శాతం మంది అమెరికాలో పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు.

అలా వెళ్ళిన తెలుగు వారు అక్కడి రాష్ట్రాలు, ప్రాంతాల వారిగా పలు తెలుగు సంస్థలు ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉండే తెలుగువారి అభివృద్దే ధ్యేయంగా, తెలుగు భాషా, సంస్కృతీ, సాంప్రదాయలను గౌరవించే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యంగా తెలుగుభాషాభివ్రుద్ది కోసం తెలుగు సంఘాలు ఏర్పాటు చేయని కార్యక్రమం ఉండదు.ఈ క్రమంలోనే వంగూరి ఫౌండేషన్ ప్రతీ ఏటా అమెరికాలో నిర్వహించే ఉత్తమ రచనల పోటీలకు ఆహ్వానం అందిస్తోంది.

1994 లో అమెరికాలో స్థాపించబడిన ఈ వంగూరి ఫౌండేషన్ తెలుగు రచనలు, కధలు, భావి తరాలకు అందించేందుకు ఓ అద్భుతమైన కార్యక్రమం ప్రతీ ఏటా చేపడుతోంది.

స్థాపించిన నాటి నుంచీ ఉగాది ఉత్తమ రచనల పోటీలను నిర్వహిస్తోంది.ప్రస్తుతం 27 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలకు తెలుగు వారందరికీ ఆహ్వానం అందిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎవరైనా సరే ఈ పోటీలలో పాల్గొనవచ్చునని ప్రకటించింది.

అయితే భారత దేశంలో ఉన్న తెలుగు వారికి ఈ అవకాశం లేదని తెలిపింది.

ఇది కేవలం తెలుగు ఎన్నారైలకు మాత్రమేనని సంస్థ తెలిపింది.వంగూరి నిర్వహించే ఈ పోటీలలో రెండు విభాగాలు ఉంటాయి.

ఉత్తమ కధ, ఉత్తమ కవిత.ప్రతీ విభాగానికి రెండు బహుమతులు సమానంగా ఇవ్వనున్నారు.

ఏ బహుమతైనా సరే 116 డాలర్లు గా నిర్ణయించారు అంటే భారత కరెన్సీలో రూ.

8628 /- అయితే ఈ పోటీలలో పాల్గొనే వారికి షరతులు కూడా ఉన్నాయి.

-పోటీలలో పాల్గొనే వారు సొంత కవిత, లేదా కథ లను మాత్రమే పంపాలి, కాపీ కథలు, కవితలు పంపకూడదు.

ఇది కేవలం తెలుగు వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కార్యక్రమమని తెలిపారు.

- రచయితలు తమ రచనలను గౌతమీ ఫాంట్ లోనే పంపాలి, ఒక్కో విభాగానికి ఒక్కొక్కటి మాత్రమే పంపాలి.

- మీకు నచ్చిన విధంగా నచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.

రచనలు చేసేవారు వారి సొంత వెబ్సైటు లలో, బ్లాగులలో ముందుగానే ప్రచురించిన రచనలు, కవితలు పంపకూడదు.

అంతేకాదు ఇవి మా మొదటి రచనలు అని హామీగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

- విజేతలను ఎంపిక చేయడంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం.

రచనలు అందాల్సిన చివరి తేదీ మార్చి 15 -2022 మరిన్ని వివరాలకోసం Vangurifoundation@gmail!--com .

స్పీకర్ కి జగన్ రాసిన లెటర్ పై స్పందించిన బుద్ధా వెంకన్న..!!