బుల్లెట్ 350 కంటే తక్కువ ధరలకే వందేభారత్ ఈవీ.. ఒకసారి ఫీచర్స్ చూడండి!
TeluguStop.com
వందే భారత్( Vande Bharath ) పేరు వినగానే అందరికీ హై స్పీడ్ రైలు గుర్తు వస్తుంది కదూ.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో అత్యంత వేగంగా దూసుకుపోయే వందే భారత్ రైలు అంటే ప్రస్తుత జనాలకి క్రేజ్ ఎక్కువ.
ఎందుకంటే ఇది అనుకున్న సమయానికన్నా తక్కువ సమయానికే ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది.
అయితే వందే భారత్ కేవలం రైళ్లకే పరిమితం కాలేదిప్పుడు.ఓ ఎలక్ట్రిక్ రిక్షా మోడల్( Electric Rickshaw Model ) పేరు కూడా వందే భారత్ అనే విషయం ఎంతమందికి తెలుసు.
సాహ్నియానంద్ ఇ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( SAHNIANAND E VEHICLES PRIVATE LIMITED )ఈ రిక్షాలను తయారు చేస్తుండడం విశేషం.
వందే భారత్ ఇ-రిక్షా పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన ట్రాన్స్‌పోర్టేషన్ ఆప్షన్.
వందే భారత్ ఇ-రిక్షా.వందే భారత్, వందే భారత్ లి అనే మోడళ్లలో మార్కెట్లోకి వచ్చాయి.
ఈ ఇ-రిక్షాలు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయి.కానీ విభిన్న బ్యాటరీలతో వచ్చాయి.
ఒక మోడల్ లీడ్ యాసిడ్ యూనిట్‌ను ఉపయోగిస్తుంది, మరొకటి లిథియం బ్యాటరీతో పని చేస్తుంది.
"""/" /
వందే భారత్ ఇ-రిక్షా( Vande Bharat E-rickshaw ) గురించి చెప్పుకోవాలంటే మొదటిగా దాని ధర గురించి మాట్లాడుకోవాలి.
45 లక్షలకే ఈ ఇ-రిక్షా లభిస్తుంది.ఇది అత్యంత పాపులర్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కంటే చౌకైనది అంటే మీరు నమ్ముతారా? దీని ధర రూ.
1.5 లక్షల కంటే ఎక్కువ మాటే.
బడ్జెట్-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ మోడ్ కోసం చూస్తున్న వారికి వందే భారత్ ఇ-రిక్షా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
"""/" /
స్పెసిఫికేషన్లు:
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
ఇ-రిక్షా పొడవు 2,780mm, వెడల్పు 1,000mm, ఎత్తు 1,790mm, వీల్‌బేస్ 2,200mm
గ్రౌండ్ క్లియరెన్స్ 180mm
130Ah లేదా 5 KWh సామర్థ్యాలతో లెడ్-యాసిడ్ లేదా లిథియం బ్యాటరీ ఉంటుంది.
51.2V DC సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ని ఉపయోగించి ఇ-రిక్షాను ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటలు పడుతుంది.
కెనడాలో భారతీయ విద్యార్థుల నిజ స్వరూపం ఇదేనా.. వీడియో వైరల్!