ఓటీటీ పై గోదారి సినిమాలు రాబోతున్నాయా?

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది.ప్రేక్షకులు సినిమా హాలుకు వచ్చి సినిమా చూసేందుకు చూపిస్తున్న ఆసక్తి తగ్గుతుంది.

థియేటర్లు వ్యూవర్స్‌ ఏడాది ఏడాదికి తగ్గుతున్న ఈ సమయంలో ఎక్కువ శాతం ఫిల్మ్‌ మేకర్స్‌ వెబ్‌ సిరీస్‌ ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రముఖ స్టార్స్‌ మరియు డైరెక్టర్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌ లను తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉండగా నిర్మాతలు కూడా వెబ్‌ సిరీస్‌ లపై కోట్లు పెట్టేందుకు రెడీగా ఉన్నారు.

ఈ సమయంలో ప్రముఖ దర్శకుడు వంశీ కూడా వెబ్‌ సిరీస్‌ లను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

తెలుగులో దర్శకుడు వంశీ తనదైన ముద్రను వేశాడు.ఆయన తెరకెక్కించిన మహర్షి, సితార, అన్వేషణ, లేడీస్‌ టైలర్‌, ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు ఇంకా పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికి టీవీల్లో వస్తే ప్రేక్షకులు అతక్కు పోయి చూసేలా ఉన్నాయి.

క్లాసిక్‌ చిత్రాలను తెరకెక్కించిన వంశీ తన సినిమాలను ఎక్కువగా గోదావరి నేపథ్యంలోనే తెరకెక్కించాడనే విషయం తెల్సిందే.

ఇప్పుడు ఆయన వెబ్‌ సిరీస్‌లను కూడా గోదావరి నేపథ్యంలో తీయబోతున్నాడట. """/"/ ప్రముఖ నిర్మాత ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడని సమాచారం అందుతోంది.

పది ఎపిసోడ్స్‌తో కొత్త నటీనటులతో తనదైన శైలి కామెడీతో వంశీ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ రెడీ చేశాడట.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్‌ను మొదలు పెట్టి మూడు నెలల్లోనే పూర్తి చేసి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ పై ఆ వెబ్‌ సిరీస్‌ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారట.

ఈమద్య కాలంలో సినిమాలను ఆకట్టుకునేలా తీయలేక పోయిన వంశీ మరి వెబ్‌ సిరీస్‌లను అయినా ఆకట్టుకునేలా తీస్తాడా చూడాలి.

ఈ మొబైల్ నంబర్ శాపగ్రస్తమైనదా.. ముగ్గురు ప్రాణాలను బలిదీసుకుందిగా..??