వంశీ అజ్ఞాతంలోనే ఉన్నారా ?  అరెస్ట్ తప్పదా ? 

వైసీపీ నేత,  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వంశీ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.దాదాపు అజ్ఞాతంలో ఉన్నట్లుగానే  వ్యవహరిస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించేవారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఆయన కుమారుడు నారా లోకేష్ తో( Nara Lokesh ) పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని వంశీ చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి.

అయితే ఇప్పుడు కొత్తగా టిడిపి , జనసేన,  బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో వంశీకి కేసుల భయం  ఉండడంతోనే ఆయన అజ్ఞాతంలో ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు పై( Gannavaram TDP Office ) దాడి కేసులో ఆయనను ఏ 71 గా పోలీసులు చేర్చారు.

"""/" / ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

మిగిలిన వారు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.  దీంతో ఆయన కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారట.

ఇటీవల కాలంలో ఆయన విజయవాడలో కనిపించడం లేదని,  ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ కు మకాం  మార్చినట్లుగా ప్రచారం జరుగుతోంది .

ఎన్నికల ముగిసిన తర్వాత వంశీ ఇంటిపై టిడిపి కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేశారని,  అప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారని, పోలీసులు టిడిపి నేతలను అదుపు చేయడంతో ఆయన ఆరోజు రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్ళిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.

  అయితే ఆయన హైదరాబాదులో( Hyderabad ) ఉన్నా ఎవరికి అందుబాటులో లేరని చెబుతున్నారు.

దీంతో పోలీసులు ఆయన కోసం వెతుకులాట మొదలుపెట్టారట. """/" / గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి కేసే కాకుండా గతంలో ఆయనపై నమోదైన కేసులు ను బయటకు తీసే పనిలో ఉన్నారు .

ప్రభుత్వం మద్యం దుకాణాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించేలా చేసి , తన అనుచరుడు బార్ కు లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

దీనికి సంబంధించిన ఒక లేఖ కూడా బయటకు వచ్చిందట.దీంతోపాటు ఇంకా అనేక కేసుల్లో వంశీ ఉండడంతో ఆయన కోసం వెతుకులాట మొదలుపెట్టినట్లు సమాచారం.

దేవర ఫ్యాన్స్ కు అదిరిపోయే తీపికబురు చెప్పిన నాగవంశీ.. ఆ క్లారిటీ ఇచ్చేశాడుగా!