ఏంటి శ్రీవిద్య మరి ఇలా తయారయ్యావ్.. ఏమైనా హెల్త్ ప్రాబ్లెమ్ ఉందా ?

ఈ మధ్య ఎక్కడ చుసిన దర్శకుడు వక్కంతం వంశి భార్య అయినా ఆట శ్రీవిద్య ఇంటర్వూస్ హల్చల్ చేస్తున్నాయి.

ఆమె తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్తూ ఎమోషనల్ అవుతున్న వీడియోస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఆమె బరువు తగ్గడం అలాగే ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడం వరకు ఒకే కానీ ఆమెను ఇన్నాళ్ల తర్వాత మరి ఇంత బక్క చిక్కి పోయి పేషేంట్ లా కనిపిస్తుంటే అందరు నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఎవరైనా బొద్దుగా ఉంటె కాస్త ముద్దుగానే ఉంటారు.అయినా ఆమె మరి అంత లావుగా ఏమి ఉండేది కాదు.

ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ కొంచం బొద్దుగా ఉండేది మాత్రమే.అయితే ఆమె లేటెస్ట్ లుక్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

శ్రీవిద్య ఆట వండి ఒక డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా మొదట్లో లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా అయినా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి దర్శకత్వం వహించి వక్కంతం వంశీ బాగా పాపులర్ అయ్యాడు.

అంతకు ముందు కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన వంశీ ఆ తర్వాత దర్శకుడిగా మారారు.

కానీ ఎంతో కష్టపడి తీసిన ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం తో వంశీ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది.

ఇక వంశీ భార్య గా కాకుండా ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న శ్రీవిద్య ఇద్దరు పిల్లలు పుట్టే వరకు చాల చక్కగా ఉంది.

ఎవరైనా పెళ్ళై పిల్లలు పుడితే కాస్త వొళ్ళు చేస్తారు.కానీ విచిత్రంగా శ్రీవిద్య దారుణం గా బరువు కోల్పోయి చాల చిక్కి శల్యమైన లుక్ లో కనిపిస్తుంది.

"""/"/ మరి ఇలా ఉంటె ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆమె ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు.

ఈ కామెంట్స్ చూసైనా శ్రీవిద్య ఆ పిచ్చి పిచ్చి డైట్స్ మానేసి కొంచం బరువు పెరిగితే ఆమె అభిమానులు చూడాలి అనుకుంటున్నారు.

రానున్న రోజుల్లో అయినా ఆమె కొంచం వొళ్ళు చేసి మునుపటిలా లావుగా కాకపోయినా ఇంకాస్త వెయిట్ పెరిగితే బాగుంటుంది.

ఇక వంశీ మరియు శ్రీవిద్య లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వీరు మాత్రమే కాకుండా ఒక కాన్పులో బిడ్డను కూడా కోల్పోయిందట.

విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు… మీడియాపై ఫైర్ అయిన అనసూయ?