Vakkantham Vamsi : నా జీవితాన్ని మార్చింది ఈ ముగ్గురు హీరోలు మాత్రమే : వక్కంతం వంశీ

వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) తన కెరియ కెరియర్ ను రైటర్ గా మొదలుపెట్టి ఎన్నో ఏళ్లపాటు ప్రయాణం చేసి దర్శకుడుగా మారి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు వంశీ.

అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకి దర్శకత్వం వహించడంతో వక్కంతా వంశీ గురించి ఇండస్ట్రీ తో పాటు సాధారణ జనాలు కూడా గుర్తించడం మొదలుపెట్టారు అంతకుముందు ఎన్నో సినిమాలకు కథను అందించిన కథకుడిగా మాత్రమే ఇండస్ట్రీ వారికి తెలుసు.

తన జీవితంలో కేవలం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా( Naa Peru Surya ) మాత్రమే కాదు ఈ ముగ్గురు వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెబుతున్నాడు వక్కంతం వంశీ.

"""/"/ తాను మొదటి నుంచి రైటర్ గానే పనిచేశాను కిక్ సినిమా( Kick Movie ) తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందులో డైలాగ్స్ కానీ ఆ సినిమాలోని పాత్రలు కానీ నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పాత్రలోని అందుకే వాటిని ఆ సినిమాలో పెట్టడంతో ఇప్పటికీ దాని గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారని కిక్ గాని రవితేజ( Raviteja ) గాని నాకు మొట్టమొదటి సక్సెస్ అందించిన వారు అంటూ చెప్పుకొచ్చాడు వంశీ.

ఇక ఇండస్ట్రీలో తారక్ నా బెస్ట్ ఫ్రెండ్ అని నా గురించి అతనికి ఇన్ అండ్ డౌట్ మొత్తం తెలుసు కాబట్టి నన్ను దర్శకుడుగా పరిచయం చేయాలని తారక్ ఎంతగానో పట్టుబట్టాడని చెప్పాడు.

"""/"/ తనే నన్ను సినిమా కథ రాయమని ఆ సినిమాలో తానే హీరోగా నటిస్తానని చెప్పి మాట ఇచ్చాడని కూడా చెప్పాడు కానీ తారక్( Tarak ) స్టాండర్డ్ లో కథ రాయడానికి తాను రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకున్నానని అది ఏ రకంగానూ ముందుకు కదలక పోవడంతో ఆ మధ్యలో మరొక సినిమా ఏదైనా రాసి ఆ తర్వాత మళ్లీ తారక్ కి కథ పూర్తి చేయాలని భావించిన సమయంలో నల్లమలుపు బుజ్జి అల్లు అర్జున్ కి చెప్పడం తో అప్పటి కే అతనికి రేసుగుర్రం సినిమా( Race Gurram )కు కథ అందించిన సాన్నిహిత్యం ఉండడంతో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ చెప్పడంతో ఓకే కావడం ఆ సినిమాతో అల్లు అర్జున్ ని నేను డైరెక్ట్ చేయడం జరిగింది అని ఇలా రవితేజ, తారక్, అల్లు అర్జున్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారంటూ చెప్పుకొచ్చాడు వక్కంతం వంశీ.

బిగ్‌బాసుకి ఏమయ్యింది? ఈ ఎంపికలేంట్రా బాబూఅని బోరుమంటున్న ప్రేక్షకులు!