కొట్లాటతోనే దిగుతున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాతో పవన్ రీఎంట్రీ పవర్‌ఫుల్‌గా ఉండనుందనే విషయం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఇట్టే అర్ధమవుతోంది.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ అనే పేరుతో రీమేక్ చేస్తుండటంతో, పవన్ ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పవన్ దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపై కనిపించనున్నాడు.మరి ఇంత గ్యాప్ తరువాత పవన్ ఎంట్రీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ ఓ అదిరిపోయే ఫైట్ సీన్‌తో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో కూడా ‘పింక్’లో కూడా ఇంట్రో సీన్ చాలా భిన్నంగా ఉంటుంది.దీంతో పవన్ ఫ్యాన్స్ పవన్ ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అనే అంశంపై చర్చించుకుంటున్నారు.

కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

వీడియో వైరల్: మండే ఎండల నుంచి రిలాక్స్ కావాలంటే ఇంటిని ఇలా చేసుకుంటేపోలే..