వకీల్ సాబ్ డైరెక్టర్ క్యూట్‌ ఫ్యామిలీని చూడండి

దిల్ రాజు కాంపౌడ్ లో సుదీర్ఘ కాలంగా ఉంటూ ఎంసీఏ వంటి సూపర్ హిట్‌ సినిమాను అంతకు ముందు ఒక ప్లాప్ సినిమాను కూడా తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్‌.

సినిమాలు ఏమీ చేయకుండా దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ వ్యవహారాలు చూసుకుంటూ నెల నెల సాలరీని తీసుకుంటు ఉన్న వేణు శ్రీరామ్‌ ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయాడు.

అల్లు అర్జున్‌ తో ఐకాన్ సినిమాను చేసే అవకాశం దక్కింది.అయితే బన్నీ వరుస సినిమాల కారణంగా ఐకాన్ ఆలస్యం అవుతూ వస్తోంది.

ఐకాన్ కంటే ముందు పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాన్ తో పింక్ రీమేక్‌ వకీల్‌ సాబ్‌ ను తెరకెక్కించాడు.

పింక్ వంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్‌ సినిమాను వకీల్‌ సాబ్‌ లా కమర్షియల్‌ గా మార్చిన ఘనత వేణు శ్రీరామ్ కు దక్కింది.

అందుకే వేణు శ్రీరామ్‌ అంటే పవన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా ప్రత్యేకమైన అభిమానం పెరిగింది.

వరుసగా సినిమాలు చేస్తాడు అనుకున్న వేణు శ్రీరామ్‌ ఇప్పటి వరకు తదుపరి సినిమాను ప్రకటించలేదు.

వకీల్‌ సాబ్‌ సక్సెస్ తో వేణు శ్రీరామ్‌ కు ఖచ్చితంగా ఐకాన్‌ చేసే అవకాశం వస్తుందని అంతా భావించారు.

కాని అనూహ్యంగా అతడు మాత్రం ఇంకా తదుపరి సినిమాను ప్రకటించలేదు.అసలు ఏం చేస్తున్నాడు.

ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ ఉండగా వేణు శ్రీరామ్ అప్‌ డేట్ వచ్చింది.ఆయన ఫ్యామిలీతో చక్కని జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడు.

వేణు కు ఒక్కగానొక్క కూతురు ఉంది.ఆ పాప అచ్చు అతడిలాగే ఉంటుంది.

"""/"/ గతంలో వకీల్ సాబ్‌ ప్రమోషన్‌ సందర్బంగా ఆ పాప సందడి చేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు దీపావళి సందర్బంగా వేణు శ్రీరామ్‌ తన ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేశారు.

క్యూట్‌ ఫ్యామిలీ అంటూ అంతా కూడా ఈయన ఫ్యామిలీ ఫొటోను తెగ లైక్స్ చేస్తున్నారు.

వేణు అన్నా మళ్లీ ఎప్పుడు సినిమా తీస్తారు.మీ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాం అంటూ చాలా మంది ఈ ఫొటోకు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి చాలా రోజుల తర్వాత చాలా నీట్‌ గా పండుగ లుక్ లో వేణు శ్రీరామ్ ను చూశామంటున్నారు.

మనోడు కాస్త బరువు తగ్గినట్లున్నాడే అంటూ కొందరు కామెంట్స్‌ లో పేర్కొంటున్నారు.

కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు..: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి