ప్రేమలో పడ్డ వకీల్ సాబ్ బ్యూటీ..!

షార్ట్  ఫిలింస్ తో కెరియర్ మొదలు పెట్టి ఆ క్రేజ్ తో మల్లేశం సినిమాలో ఛాన్స్ అందుకున్న అనన్యా నాగల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.

వకీల్ సాబ్ తో అనన్యా నాగల్ల కు స్పెషల్ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇక ఆ క్రేజ్ ను తన రెగ్యులర్ అప్డేట్స్, ఫోటో షూట్స్ తో డబుల్ చేసుకుంటుంది అనన్యా నాగల్ల.

ఈ క్రమంలో లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టాగ్రాం లో తన యోగా చేస్తున్న పిక్స్ షేర్ చేసింది.

ఈ పిక్స్ షేర్ చేస్తూ తాను యోగాలో ప్రేమతో ఉన్నా.ఆ తర్వాత తనని తాను ప్రేమిస్తున్నా అని అన్నది.

వకీల్ సాబ్ తర్వాత కథానాయికగా ఛాన్సులు వచ్చినా ఓ మంచి అవకాశం కోసం చూస్తుంది అనన్యా.

తప్పకుండా అమ్మడికి అలాంటి ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు.ఫ్రీ టైం లో తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అనన్యా నాగల్ల హీరోయిన్ గా ఒక్క హిట్టు పడ్డది అంటే ఇక కెరియర్ టర్న్ అయినట్టే అని అంటున్నారు.

ఇప్పటికే కథా చర్చల్లో పాల్గొంటున్న అమ్మడు ఒకటి రెండు ప్రాజెక్టులను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

త్వరలోనే వాటి ఎనౌన్స్ మెంట్ వస్తాయని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కి నా మద్దతు.. నంద్యాల టూర్ పై బన్నీ క్లారిటీ?