ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి వకీల్ సాబ్ రెడీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెరపై కనిపించిన సినిమా వకీల్ సాబ్.

పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఫ్యాన్స్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.మహిళల నుంచి విశేషమైన ఆదరణ వస్తుంది.

రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమాలకి భిన్నంగా మహిళల ఇతివృత్తంగా ఈ సినిమా రావడం.

మహిళల సమస్యల మీద పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాత్రలో వాదించడం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.

దీంతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.ఒరిజినల్ చిత్రానికి మించి ఈ సినిమాకి ఆదరణ వస్తూ ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే ఇప్పటికే థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి.ఏపీలో వకీల్ సాబ్ సినిమా ప్రదర్శనకి అధికార పార్టీ నుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్న ఓవరాల్ గా మాత్రం సినిమాని కొనుక్కున్న డిస్టిబ్యూటర్స్ అందరికి లాభాలు తీసుకొచ్చేలా ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని థియేటర్ లో కాకుండా డైరెక్టర్ గా డిజిటల్ రిలీజ్ కోసం అమెజాన్ ఏకంగా వంద కోట్లు ఆఫర్ చేసింది.

అయితే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ స్పందనే వేరుగా ఉంటుంది.

ఈ నిర్మాత దిల్ రాజు ఊహించినట్లుగానే మంచి స్పందన వస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ కి ఇప్పటికే అమ్మేయడంతో డిజిటల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసేశారు.

ఏప్రిల్ 23న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు.థియేటర్స్ లో వచ్చినట్లే అమెజాన్ లో కూడా వకీల్ సాబ్ కి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

వీడియో వైరల్: అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఎక్కడంటే..