‘ఆదికేశవ’ ప్రమోషన్స్ ఎక్కడ.. ఇలా అయితే ప్లాప్ లిస్టులో చేరడం ఖాయం!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్( Panja Vaisshnav Tej ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆదికేశవ'( Aadi Keshava ).

ఈ సినిమాపై వైష్ణవ్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు.ఎందుకంటే ఈ సినిమా కంటే ముందు వరుస డిజాస్టర్స్ పలకరించాయి.

ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వైష్ణవ్ మరో సక్సెస్ కొట్టలేక పోయాడు.

ఉప్పెనతో ఒక్కసారిగా క్రేజ్ పెంచుకున్న ఈయన ఆ తర్వాత ఏ సినిమాకు సక్సెస్ కొట్టలేదు.

ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేదు.కొండపొలం, రంగరంగ వైభవంగా వంటి రెండు సినిమాలతో వచ్చిన ఫలితం సూన్యమే.

అందుకే ఇప్పుడు చేస్తున్న నాల్గవ సినిమాతో అయినా తన రేంజ్ మార్చుకోవాలని వైష్ణవ్ చూస్తున్నాడు.

"""/" / మరి ఆదికేశవ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది.అప్పుడే నవంబర్ మంత్ కూడా వచ్చేసింది.

అయినప్పటికీ ఇంకా ఆదికేశవ టీమ్ మాత్రం సరైన ప్రమోషన్స్ చేయడం లేదు.ఈ మధ్య ప్రమోషన్స్ బాగుంటేనే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తున్నారు.

ఏదో సాంగ్స్ రిలీజ్ చేసి మమ అనిపించారు.కానీ ప్రోపర్ గా ప్రమోషన్స్ మాత్రం చేయడం లేదు.

ఈ రకంగా చేస్తే ఆదికేశవ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే.మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా పాటలతో అయితే పర్వాలేదు అనిపించింది.

ఇక ఈ సినిమాలో మెయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న పాయింట్ ఏంటంటే శ్రీలీల ( Sreeleela ), వైష్ణవ్ కెమిస్ట్రీ అనే చెప్పాలి.

"""/" / ఈమె ఈ సినిమాలో ఉండడం వల్ల కాస్త అంచనాలు ఉన్నాయి.

మరి సరైన ప్రమోషన్స్ చేయకపోతే ఈ సినిమా కూడా ఈయన ప్లాప్ లిస్టులో చేరిపోవడం ఖాయం.

మరి వైష్ణవ్ రిలీజ్ సమయానికి వరుస ప్రమోషన్స్ తో ఏదైనా మ్యాజిక్ చేయగలిగితే తప్ప ఈ సినిమా ఓపెనింగ్స్ అందుకోవడం కష్టమే.

కాగా జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

నవంబర్ 10న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

బాలయ్య ‘అఖండ 2’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు..?