Vaishanvi Chaitanya : తెలిసి తెలిసి తప్పటడుగులు వేస్తున్న బేబీ హీరోయిన్..ఎంటి ఆ కథ 

వైష్ణవి చైతన్య.బేబీ సినిమా( Baby Movie )తో ఆమె జాతకం రాత్రికి రాత్రి మారిపోయింది.

షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ అడపా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్న వైష్ణవి చైతన్యకు దర్శకుడు రాజేష్ బేబీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడంతో గట్టిగా ఇచ్చిపడేసింది.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైష్ణవి ఇప్పుడు అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఎవరైనా హీరోయిన్( Heroine ) గా స్టార్డం అందుకునే సమయంలో మళ్లీ పక్క పాత్రల జోలికి వెళితే కెరియర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాదు.

అయితే ప్రస్తుతం వైష్ణవి చైతన్యకు చెల్లి పాత్ర ఒకటి వచ్చిందట అది కూడా ఆమె చేయాలని ఫిక్స్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ఆమె కెరియర్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయం కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

"""/"/ వైష్ణవి ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ సినిమా( Siddu Jonnalagadda )లో హీరోయిన్ గా అలాగే ఆశిష్ రెడ్డి చిత్రంలో కూడా నటిస్తుండగా ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) తో కూడా మరో చిత్రంలో నటించబోతోంది.

ఈ మూడు సినిమాలు ఆమెకు లేడు హీరోయిన్ గా అవకాశాలు ఇస్తే ఆమె మాత్రం ఒక చెల్లి పాత్ర కోసం ఆరాటపడుతుందట.

గతంలో కీర్తి సురేష్ కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో చెల్లి పాత్రలో నటించింది.

కానీ ఆ సినిమా ఆమె కెరియర్ కి ఉపయోగపడకపోగా మైనస్ అయింది.ఇప్పుడు తెలిసి కూడా వైష్ణవి చైతన్య అలాంటి ప్రయోగం చేయబోతుందట.

"""/"/ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఆ చిత్రానికి స్పిరిట్( Spirit ) అనే పేరును కన్ఫర్మ్ చేశారు.

అయితే ఆ సినిమాలో ప్రభాస్ కి చెల్లి పాత్ర( Prabhas Sister Role ) కోసం అనేక మంది హీరోయిన్స్ ని పరిశీలించినప్పటికీ వైష్ణవి చైతన్య బాగుంటుందని డైరెక్టర్ అనుకుంటున్నాను.

మరి ఇలాంటి సినిమా కోసం హీరోయిన్ కాస్త చెల్లి అయిపోతే ఆ తర్వాత మళ్లీ హీరోయిన్ పాత్రలు రావడం ఎంత వరకు సాధ్యం అనేది ఆలోచించుకోకుండానే వైష్ణవి తప్పు చేస్తుందా ? దీని గురించి పూర్తి అప్డేట్స్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?