సురేష్ కొండేటికి భారీ షాకిచ్చిన వైష్ణవి చైతన్య.. ముద్దు పెడతానంటే చెప్పు తెగుతుందంటూ?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య( Anand Devarakonda, Vaishnavi Chaitanya ) కాంబినేషన్ లో తెరకెక్కిన బేబి మూవీ ( Baby Movie )జులై నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

బేబి ట్రైలర్ కు ఇప్పటివరకు 3.9 మిలియన్ వ్యూస్ రాగా ఈ వ్యూస్ అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ సినిమా చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యకమవుతున్నాయి.

ఆనంద్ దేవరకొండకు ఈ సినిమాకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో వివాదాస్పద ప్రశ్నలు, కామెంట్ల ద్వారా పాపులర్ అయిన సురేష్ కొండేటి( Suresh Kondeti ) బేబి టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సురేష్ కొండేటి వైష్ణవి చైతన్యతో ముద్దు పెట్టుకుంటా అని అన్నారు.

వైష్ణవికి అర్థం కాక విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా ఆ తర్వాత సురేష్ కొండేటి "ఈ మూవీలో హీరో అడిగిన ప్రశ్న ముద్దు పెట్టుకుంటా అన్నాడు.

దానికి మీ రియాక్షన్ ఏంటి" అని అడగగా చెప్పు తెగుద్ది అని వైష్ణవి చైతన్య బదులిచ్చారు.

"""/" / సురేష్ కొండేటి వెంటనే ఓహో.చెప్పు తెగుద్దా అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

సురేష్ కొండేటి కావాలనే ఈ తరహా ప్రశ్నలు అడుగుతున్నారా? లేక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయా అనే కామెంట్లకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

సురేష్ కొండేటి పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్( Producer, Distributor ) గా వ్యవహరించడం గమనార్హం.

"""/" / బేబి మూవీ ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ప్రత్యేకంగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ జనరేషన్ కు అనుగుణంగా నిజ జీవితంలో జరుగుతున్న ఘటనలను ఈ సినిమాలో చూపిస్తున్నామని వైష్ణవి చైతన్య అన్నారు.

ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

హలో లేడీస్.. నెలసరిలో కాఫీ వద్దే వద్దు..!