Vaishnav Tej Adikesava: ఉప్పెన రేంజ్ హిట్ ను వైష్ణవ్ తేజ్ సాధిస్తాడా.. ఆ మూవీ ఫ్లాపైతే వైష్ణవ్ కెరీర్ కే ప్రమాదమా?
TeluguStop.com
మెగా హీరో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఉప్పెన సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న వైష్ణవ తేజ్ ఆ తర్వాత నటించిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
ఉప్పెన సినిమా( Uppena Movie ) తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి.ఇది ఇలా ఉంటే వైష్ణవ్ తేజ్ హీరోగా మరో సినిమాలో నటిస్తున్నాడు.
అదే ఆది కేశవ.( Adikesava Movie ) అందులో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల( Sreeleela ) హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. """/" /
అంతేకాకుండా ఈ సినిమాతోనే శ్రీకాంత్ దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై నాగ వంశీ,సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
కాగా ప్రస్తుతం వరుస సినిమాలతో శ్రీ లీల మంచి దూకుడు మీద ఉంది.
కచ్చితంగా ఆదికేశవ సినిమాకు శ్రీ లీల ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.శ్రీ లీల మాత్రమే కాదు మలయాళ నటుడు జోజు జార్జ్ కూడా సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈ మధ్య మలయాళంలో కొత్త కొత్త ప్రయోగాల తో క్రేజ్ తెచ్చుకున్న జోజు జార్జ్ కూడా ఆదికేశవ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.
ఇక రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
"""/" /
టీజర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.అందులో కథ రొటీన్ గానే అనిపించినా శ్రీకాంత్ రెడ్డి మేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
నూతన దర్శకుడే అయినా శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంతవరకు బాగానే ఉన్న ఉప్పెన సినిమాతో హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు నిరాశపరిచాడు.
మరి ఆదికేశవ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.ఆదికేశవ అటు ఇటు అయితే మాత్రం కచ్చితంగా మెగా మేనల్లుడి కెరీర్ రిస్క్ లో పడినట్టే అని చెప్పవచ్చు.
మరి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఏ మేరకు సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి మరి.
విశ్వంభర సినిమాతో వశిష్ట భారీ విజయాన్ని సాధించబోతున్నాడా..?