థియేటర్లలో ఫ్లాప్ టీవీలో మాత్రం హిట్.. కొండపొలం రేటింగ్ ఎంతంటే?

వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన తోనే తను మంచి నటుడని ప్రూవ్ చేసుకున్నారు.

ఆ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించారు.

అక్టోబర్ రెండో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లను సాధించడంలో కొండపొలం ఫెయిలైంది.

వైష్ణవ్ తేజ్ రెండో సినిమాగా ఈ సినిమాను ఎంపిక చేసుకుని తప్పు చేశారని కామెంట్లు వినిపించాయి.

ఈ సినిమాలోని ఓబులమ్మ పాత్రకు రకుల్ న్యాయం చేసినా రకుల్ ఖాతాలో ఈ సినిమాతో మరో ఫ్లాప్ చేరింది.

ఆ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి రాగా ఓటీటీలో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

థియేటర్లలో, ఓటీటీలో సినిమా ఫ్లాప్ కావడంతో టీవీలో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించకపోవచ్చని ప్రేక్షకులు భావించారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా టీవీలలో మాత్రం ఈ సినిమా హిట్ అనిపించుకుంది.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్ లో తాజాగా కొండపొలం సినిమా ప్రసారం కాగా ఈ సినిమా ఏకంగా 12.

34 టీఆర్పీ రేటింగ్ ను సాధించింది. """/" / అర్బన్ ఏరియాలో కొండపొలం ఈ రేటింగ్ ను సొంతం చేసుకోగా రూరల్ ఏరియాలో ఈ సినిమాకు 10.

54 రేటింగ్ వచ్చింది.పెద్ద సినిమాల స్థాయిలో కొండపొలం సినిమా రేటింగ్ ను సొంతం చేసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఎం.ఎం.

కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

వైష్ణవ్ తేజ్ పుట్టినరోజున వెలువడిన కొండపొలం రేటింగ్ వార్త వైష్ణవ్ కు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : పెన్సిల్వేనియా ప్రైమరీలో ట్రంప్‌కు షాక్ .. నిక్కీహేలీదే విజయం