మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకోగా సెకండ్ మూవీ కొండపొలం పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇక వైష్ణవ్ తేజ్ థర్డ్ మూవీగా గిరీశయ్య డైరక్షన్ లో రంగ రంగ వైభవంగా సినిమా వస్తుంది.
జూలై 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది.
ఈ టీజర్ లో వైష్ణవ్ తేజ్ స్టైల్ చూస్తే మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది.
హీరోయిన్ ని రౌడీ గ్యాంగ్ ఏడిపించగా అక్కడకి వచ్చి ఫైట్ చేసే సీన్ లో వైష్ణవ్ తేజ్ పవన్ కళ్యాణ్ లానే తన ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా వైష్ణవ్ తేజ్ తన స్టైల్ తో వస్తున్నాడు.
అయితే కావాలని చేశాడో లేక మామ పవన్ ని కావాలని ఇమిటేట్ చేశాడో కానీ రంగ రంగ వైభవంగా సినిమా టీజర్ లో ఆ ఒక్క సీన్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ని టచ్ చేశాడు వైష్ణవ్ తేజ్.
తమిళ అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసిన గిరీశయ్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.
అమెరికా డ్రీమ్ అట్టర్ ఫ్లాప్.. రూ.40 లక్షల అప్పు.. ఇండియాలో రూ.9 వేలతో బతుకు పోరాటం!