హృతిక్ రోషన్ రికార్డ్ బ్రేక్ చేసిన ఉప్పెన
TeluguStop.com
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ ఉప్పెన.
ఈ సినిమా తాజాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.ఈ సినిమాతో బుచ్చిబాబు సానా దర్శకుడుగా పరిచయం అయ్యాడు.
ఇదిలా ఉంటే ఎమోషనల్ లవ్ స్టొరీగా ఈ సినిమాని బుచ్చిబాబు తెరపై ఆవిష్కరించాడు.
మొదటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.దానికి తగ్గట్లే రిలీజ్ తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది.
ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఇదిలా ఉంటే రికార్డు స్థాయిలో ఇప్పటికే 30 కోట్లకి ఇప్పైపటికే గా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మైత్రీ నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చి పెడుతుంది.
"""/"/
ఇప్పటికే టాలీవుడ్ లో డెబ్యూ హీరోగా ఉప్పెన సినిమాతో అరుదైన కలెక్షన్ రికార్డ్ సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ ఎపిక్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇండియాలో డెబ్యూ హీరోల పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా రికార్డ్ ను ఇప్పుడు ఉప్పెన బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.
ఏకంగా 21 ఏళ్ల క్రితం నమోదు అయిన రికార్డ్ ను ఇప్పుడు ఉప్పెన బ్రేక్ చేసిందని టాక్ వినిపిస్తుంది.
దాదాపు 21 ఏళ్ల క్రితం హిందీ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా పరిచయమైన కహో నా ప్యార్ హే సినిమా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.
ఈ సినిమా అప్పట్లో 41 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని రాబట్టగా, ఇప్పుడు ఉప్పెన ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
ఉప్పెన ఆ రికార్డ్‌ను 5 రోజుల్లో బ్రేక్ చేసింది.ఉప్పెన ఇప్పటి వరకు 42 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అలాగే 31 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని ఇండియా లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.