నాని సినిమాకు మెగా ఆఫర్.. మరీ అంతా?
TeluguStop.com
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని టీజర్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సూచనలు కనిపించక పోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ మేరకు చిత్ర నిర్మాత దిల్ రాజుకు అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
కాగా తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన ఓటీటీ ఆహాలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏకంగా రూ.
30 కోట్ల భారీ ఆఫర్ను అందించాడట.అయినా దిల్ రాజు మాత్రం ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూడటం లేదు.
దీంతో భారీ మొత్తంలో ఆఫర్లు వచ్చినా కూడా ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.
పూర్తి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
షాకింగ్ వీడియో: విద్యుత్ వైర్లతో మృత్యువుతో గేమ్స్ ఆడుతున్న యువకుడు..