మోదీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు..: వీహెచ్

దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు( Telangana Congress Leader V Hanumantha Rao ) అన్నారు.

పదేళ్ల బీజేపీ పాలనలో ప్రధానమంత్రి మోదీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు.

ఈ క్రమంలో మోదీకి( PM Narendra Modi ) ఓటు వేస్తే అదానీ, అంబానీలకు ఓటు వేసినట్లేనని వీహెచ్ తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధానమంత్రి అయితేనే దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా.ప్రమోషన్లు రావాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పేర్కొన్నారు.

అలాగే మోదీపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే?