వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?

ప్రఖ్యాత టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో( Tata Steel Masters Chess Tournament ) ఈసారి మన భారత ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు.

డి.గుకేష్, ఆర్.

ప్రజ్ఞానంద, నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ లాంటి యంగ్ ఛాంపియన్స్ టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతుంటే అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు.

ఐతే, మాగ్నస్ కార్ల్‌సన్, హికారు నకమురా, హాన్స్ నీమాన్ లాంటి బిగ్ షాట్స్ మిస్ అవ్వడం కాస్త నిరాశ కలిగించినా, ఛాలెంజర్స్ సెక్షన్‌లో జరిగిన ఒక వివాదం మాత్రం టోర్నీకే మచ్చ తెచ్చేలా ఉంది.

నాలుగో రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ నొదిర్బెక్ యాకుబ్బోవ్( Uzbekistan Player Nodirbek Yakubov ), మన భారతీయ అమ్మాయి వైశాలి రమేష్‌బాబుతో తలపడ్డాడు.

మ్యాచ్‌కు ఆలస్యంగా వచ్చిన యాకుబ్బోవ్, వైశాలి షేక్ హ్యాండ్ కోసం చేయి చాచినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

వైశాలికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ, ఆటలో మాత్రం అదరగొట్టింది.యాకుబ్బోవ్ డిఫెన్స్‌ని చీల్చి చెండాడి విజయం సాధించింది.

మ్యాచ్ అయిపోయాక కూడా యాకుబ్బోవ్ వైశాలిని పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో అభిమానులు, ఇతర ప్లేయర్లు మండిపడ్డారు.

ఇదేం ప్రవర్తన అంటూ యాకుబ్బోవ్‌ని సోషల్ మీడియాలో ఏకిపారేశారు.కొందరు అయితే ఇది ఆడవాళ్లని అవమానించడమే అంటూ ఫైర్ అయ్యారు.

"""/" / విమర్శలు ఎక్కువ కావడంతో యాకుబ్బోవ్ ఎక్స్ ద్వారా వివరణ ఇచ్చాడు.

"ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం నేను మహిళలతో షేక్ హ్యాండ్ ఇవ్వను.వైశాలిని, ఆమె సోదరుడు ప్రజ్ఞానందను నేను గౌరవిస్తాను.

నా వల్ల ఆమె బాధపడితే క్షమించండి" అంటూ చెప్పుకొచ్చాడు.ఇదివరకు దివ్య దేశ్‌ముఖ్, ఇరినా బుల్మాగతో( Divya Deshmukh And Irina Bulmag ) జరిగిన మ్యాచ్‌లలో కూడా ఇలానే జరిగిందని, ముందే చెప్పలేకపోయినందుకు సారీ చెప్పాడు.

అర్బిట్రర్లు 'నమస్తే' పెట్టమని సలహా ఇచ్చారని కానీ, వైశాలితో మ్యాచ్‌కు ముందు మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఇలా జరిగిందని క్లారిటీ ఇచ్చాడు.

కానీ జర్మన్ గ్రాండ్‌మాస్టర్ ఎలిసబెత్ పైట్జ్ లాంటి వాళ్లు మాత్రం 'ఇలాంటి ప్రవర్తనకు శిక్ష లేదా?' అంటూ నిలదీస్తున్నారు.

యాకుబ్బోవ్ మాత్రం తన నమ్మకాలను ఫాలో అవుతున్నానని, ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదని వాదిస్తున్నాడు.

"""/" / ఈ వివాదం ఎలా ఉన్నా, మన వైశాలి మాత్రం చెస్‌లో దూసుకుపోతోంది.

వరల్డ్ వుమెన్స్ క్లాసికల్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 16వ స్థానానికి ఎగబాకింది.వివాదాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ టాలెంట్ ఉంటే ఎవరైనా టాప్‌కు వెళ్లొచ్చని వైశాలి నిరూపించింది.