కోర్టు తీర్పుతో 'సైరా' విడుదలపై అనుమానాలు

'సైరా నరసింహారెడ్డి' చిత్రం అన్ని అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కాని సినిమాకు అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నట్లుగా లేవు.ఎందుకంటే ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు సినిమాకు వ్యతిరేకంగా, నిర్మాత చరణ్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు.

సినిమా ప్రారంభంకు ముందు మా నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవడంతో పాటు, మా కుటుంబ పెద్ద అయిన నరసింహారెడ్డి గారి వస్తువులను ఆయన గురించిన వివరాలను మా నుండి తీసుకున్నారు.

అందుకు గాను నిర్మాత మాకు డబ్బులు ఇస్తామంటూ అగ్రిమెంట్‌ రాసిచ్చాడు.ఆ అగ్రిమెంట్‌ను ఇప్పుడు చరణ్‌ పట్టించుకోవడం లేదు అంటూ కోర్టులో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.

"""/"/  ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా అంటూ మొదటి నుండి ప్రచారం చేస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా కోర్టులో మాత్రం అసలు మా ఈ చిత్రం ఉయ్యాలవాడ బయోపిక్‌ కాదని చెప్పారు.

కోర్టుకు హాజరు అయిన దర్శకుడు సైరా చిత్రం బయోపిక్‌ అస్సలు కాదని, సినిమాలో కొన్ని వాస్తవ సంఘటనలు జోడించామని, ఎక్కువ శాతం కల్పితమని చెప్పాడు.

కోర్టులో ఈ కేసు విచారణ చాలా సీరియస్‌గా సాగింది.ఇరు వాదనలు విన్నతర్వాత తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేశారు.

"""/"/  సోమవారం నుండి సినిమా విడుదలపై స్టే వస్తుందా లేదంటే క్లియరెన్స్‌ వస్తుందా అనేది చూడాలి.

సెన్సార్‌ ఈ చిత్రంకు సెన్సార్‌ పూర్తి చేసినా సర్టిఫికెట్‌ మాత్రం ఇంకా ఇవ్వలేదు.

సర్టిఫికెట్‌ చేతిలో పడితే కోర్టు స్టే ఇచ్చినా ఏం చేయలేరు.కాని కోర్టు ఆదేశాల అనుసారం సెన్సార్‌ ఇవ్వాల్సి ఉంది.

కోర్టు తీర్పు వచ్చిన తర్వాత సెన్సార్‌ వచ్చే అవకాశం ఉంది.ఇలాంటి నేపథ్యంలో అసలు సైరా చిత్రం అనుకున్న సమయంలో విడుదల అయ్యేనా లేదా అంటూ చర్చలు జరుగుతున్నాయి.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?