‘భగవంత్ కేసరి’ నుండి ఉయ్యాలో ఉయ్యాలా సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''భగవంత్ కేసరి''( Bhagavanth Kesari ).

ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. """/" / కొన్ని పోస్టర్స్, టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు.

ఇటీవలే సాంగ్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంది.అయితే దసరా బరిలో రాబోతున్న నేపథ్యంలో రిలీజ్ కు కొద్దీ సమయం మాత్రమే ఉంది.

దీంతో ఎప్పుడెప్పుడు మరింత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా సెకండ్ సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఫస్ట్ సాంగ్ గణేష్ ఆంథెమ్( Ganesh Anthem Song ) కాగా రెండవ సాంగ్ ఉయ్యాలో ఉయ్యాలా( Uyyalo Uyyala ) అంటూ సాగే ఈ సాంగ్ పై బ్యూటిఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

బాలయ్యతో పాటు తన పక్కన ఒక చిన్నారి ఉన్నట్టు ఈ పోస్టర్ లో కనిపిస్తుంది.

ఇక ఈ సాంగ్ అక్టోబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఈ సాంగ్ కు థమన్ ఎలాంటి సంగీతం అందించారో వేచి చూడాలి.

"""/" / ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

డార్క్ అండర్ ఆర్మ్స్ తో చింతేలా.. నలుపును ఇలా వదిలించుకోండి..!