సంక్రాంతికి యంగ్ హీరోను బరిలోకి దించనున్న యూవీ.. భారీ సినిమాలతో నెగ్గేనా?

మన టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.

ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.

మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.నాలుగు కూడా పెద్ద సినిమాలే.

అందులో తెలుగు నుండి రెండు సినిమాలు అయితే తమిళ్ నుండి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఇక తాజాగా రెండు చిన్న సినిమాలు కూడా ఈ సినిమాల మధ్య రాబోతున్నాయి అని తెలుస్తుంది.

మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ లో పెద్ద సినిమాలతో పోటీ పడబోతున్న చిన్న సినిమా ''కళ్యాణం కమనీయం'' అని తెలుస్తుంది.

ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది.

ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసేసారు.

మరి ఈ సినిమా పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేస్తున్నారంటే బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది.

చూడాలి పెద్ద భారీ సినిమాల మధ్య ఈ సినిమాకు థియేటర్స్ లభిస్తాయో.లభించినా ఆకట్టు కుంటుందో లేదో.

"""/"/ ఎంతైనా యూవీ వారు సాహసం చేస్తున్నారు అనే చెప్పాలి.ఇక ఈసారి సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు.

ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమా 'వరిసు', అజిత్ కుమార్ 'తునివు' కూడా రిలీజ్ కాబోతున్నాయి.

మరి ఈ పోటీలో నెగ్గేది ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది.

బాయ్‌ఫ్రెండ్‌కి పదే పదే కాల్ చేస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్య ఉండొచ్చు..?