పుష్ప కోసం అట్టర్ ప్లాప్ సినిమా విలన్.. ఎవరో తెలుసా?

అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు.

ఆ సినిమా పేరే 'పుష్ప'.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ దర్శకత్వంలో బన్నికి ఇది మూడో సినిమా గా తెరకెక్కుతుంది.

ఇది వరకే ఈ సినిమా టైటిల్ ను బన్ని పుట్టినరోజు సందర్భంగా తెలుపగా ఫస్ట్, సెకండ్ లుక్ లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ప్లాప్ అయినా సినిమా విలన్ ను నియమిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా బన్ని నటిస్తున్న పుష్ప సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం దర్శక నిర్మాతలు ఎవరిని నిర్ణయించాలని ఆలోచనలో ఉండగా.

అయితే ఆ పాత్ర కోసం బన్నీ ఇంతకుముందు నటించిన అట్టర్ ప్లాప్ సినిమా 'వరుడు' చిత్రంలో విలన్ గా నటించిన.

తమిళ్ హీరో ఆర్య ను నియమించాలని చిత్రబృందం అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇంతకుముందు బన్ని తో నటించిన ఆర్య మళ్లీ పుష్ప సినిమాలో నటించడానికి సినిమా బృందం అవకాశం ఇస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

"""/"/ ఇదిలా ఉండగా ఈ సినిమా టీం పుష్ప లో ఆర్య ను ఎంపిక చేయకముందు తమిళ్ నటుడు విజయ్ సేతుపతి ను ఫిక్స్ చేశారు.

అయితే తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల విజయ్ సినిమా నుంచి తప్పుకున్నారు.అయితే ఈ పాత్ర నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉందని విజయ్ సేతుపతి ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.

అంతేకాదు నారా రోహిత్ కు కూడా ఈ పాత్ర గురించి చెప్పినప్పటికీ అయన ఈ పాత్రకు ఓకే చెప్పలేదని సమాచారం.

అయితే ప్రస్తుతం ఈ సినిమాలో విలన్ పాత్ర కు ఆర్య సెట్ అయినట్టు వార్తలు వస్తున్నాయ్.

మరి సెట్ అయ్యాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది!.

తెలంగాణ ఎంపీ స్థానాలపై బీజేపీ ఆశలు.. క్యూ కట్టేస్తున్న అగ్ర నేతలు