వైరల్ వీడియో: మాంసం తీసుకొచ్చాడని ఏడేళ్ల చిన్నారిని స్కూల్ నుంచి సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్..

ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళిన పిల్లవాడు క్షేమంగా తిరిగి వస్తాడా రాడా అన్న సంఘటనలు మనం చాలానే చూసాం.

అయితే తాజాగా ఒక స్కూల్లో ఏడు సంవత్సరాల చిన్నపిల్లవాడు మాంసహారం( Non-Veg ) తీసుకొని వచ్చాడన్న కారణంతో ఆ పిల్లవాడిని స్కూల్లో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పాఠశాల అధికారులు తెలియచేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) అమ్రోహాలో ఏడు సంవత్సరాల గల బాలుడు మాంసాహారం తీసుకొని పాఠశాలకు వచ్చినందుకు పాఠశాల యాజమాన్యం అతన్ని బహిష్కరించారు.

ఈ సంఘటన హీల్టన్ పబ్లిక్ స్కూల్లో( Hilton Public School ) చోటుచేసుకుంది.

ఇలా ఆ చిన్నపిల్లవాడిని బహిష్కరణ చేయడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ తో( School Principal ) వాగ్దానానికి దిగారు.

ఆరోపణలో భాగంగా తన కొడుకు ఎందుకు బహిష్కరించారు అని ప్రశ్నించగా.ప్రిన్సిపాల్ తో బాలుడు తల్లి వాదించడం వీడియోలో మనం చూడవచ్చు.

"""/" / వాస్తవానికి ఎందుకు బహిష్కరించారన్న విషయానికి వస్తే.పాఠశాలకు మాంసాహారం తీసుకురావడంపై ప్రిన్సిపల్ చేస్తున్న వాదనను ఆమె ఖండించింది.

ఈ సంఘటనపై ప్రిన్సిపల్ స్పందిస్తూ 'హిందూ దేవాలయాలపై కూల్చి వేసే వారిని, హిందువులను ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేసే వారిని పాఠశాల విద్యను అందించదు" అంటూ ఆయన తెలిపారు.

అలాగే "మన దేవాలయాలను బద్దలు కొట్టే, హిందువులను హాని చేసే పిల్లలకు మేము చదువు చెప్పలేం అంటూ ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ఆ బాలుడిని పాఠశాలకు మాంసాహారం తీసుకొని రావద్దని ప్రిన్సిపల్ పదేపదే కోరినట్లు కూడా తెలుస్తుంది.

"""/" / అంతేకాకుండా మాంసాహారం తీసుకురావడం కొనసాగిస్తానని, హిందువుల విద్యార్థులందరికీ మాంసహారం తినేలాగా చేసి ముస్లింలుగా మారుస్తానని ఆ చిన్నారి చెప్పినట్లు " కూడా ప్రిన్సిపల్ పేర్కొంటున్నాడు.

ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో పోలీసులు తెలుసుకొని విచారణ చేపట్టిన క్రమంలో "పై కేసుకు సంబంధించి, వైరల్ వీడియోపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడానికి జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ అమ్రోహా ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారని దయచేసి తెలియజేయండి.

శాంతిభద్రతల పరిస్థితి సాధారణంగా ఉంది" అంటూ పోలీసులు తెలిపారు.

నాన్నను స్పూర్తిగా తీసుకుని కలెక్టర్.. ఇలా త్రిపాఠి సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!