ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్..!
TeluguStop.com
నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
పార్టీ అధిష్టానం మరికాసేపటిలో సీఎం, డిప్యూటీ సీఎం పేర్లను ప్రకటించనుంది.ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు హస్తినకు వెళ్లిన ఆయన పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.
తరువాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ స్పీకర్ ను ఉత్తమ్ కుమార్ కలవనున్నారు.
అనంతరం ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ రాధికా ఆప్టే.. ఫోటోలు షేర్ చేస్తూ?