వైజాగ్ లో ఉస్తాద్ షూట్.. శ్రీలీల – పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరణ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.

ఈ కాంబో ఇప్పటికే గబ్బర్ సింగ్ రూపంలో వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

అందుకే ఈ కాంబో అంటే టాలీవుడ్ లో భారీ క్రేజ్.గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

గబ్బర్ సింగ్ వచ్చిన పుష్కర కాలం తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుండడంతో ఉస్తాద్ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇటీవలే ఈసినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టు కున్నాడు.

అయితే పవన్ మళ్ళీ పొలిటికల్ టూర్ ప్లాన్ చేయగా ఈ సినిమాకు కూడా బ్రేక్ తప్పలేదు.

"""/" / ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం చేస్తున్నారని పవన్ టూర్ గ్యాప్ రాగానే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు.అందుకోసం ఒక ప్రత్యేక సెట్ ను వేస్తున్నారట.

ఈ కొత్త షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించ నున్నారని టాక్.

"""/" / మరి ఈ కొత్త షెడ్యూల్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శ్రీలీలకు( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్ర ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

భర్తను అన్ ఫాలో చేసిన కలర్స్ స్వాతి…. మరోసారి  తెరపైకి  విడాకుల వార్తలు?