అమెరికా కోర్టులో ట్రంప్ కి చుక్కెదురు..

అమెరికా లోకి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులను నిరోధించాలనే ఉద్దేశంతో జారీచేసిన ఉత్తర్వులపై కాలిఫోర్నియా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు జిల్లా జడ్జి జాన్ పిన్ మధ్యంతర ఉత్తరువులని జారీ చేశారు.

వలసదారులను బలవంతంగా పంపించే ఆదేశాలను ఇవ్వడం మంచిది కాదని అలా చేస్తే హక్కుల ఉల్లంఘనే అవుతుందని జడ్జి ట్రంప్ కి చురకలు అంటించారు.

ఆయా దేశాలలో జరుగుతున్న యుద్ధాల కారణంగా ప్రాణ భయంతో ఆశ్రయం కోసం వచ్చిన వారిని స్వదేశాలకు పంపించేందుకు ప్రయత్నించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు ట్రంప్ జారీచేసిన ఈ ఆదేశాల కారణంగా వలసదారులపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

భద్రతా కారణాల దృష్ట్యా అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపించే అధికారం ప్రభుత్వానికి ఉందని , ఈ విషయంలో తాము కల్పించుకోమని, అయితే వలసదారులు అందరిని అక్రమ వలసదారులను పేర్కొనడం సరైనది కాదని జడ్జి తెలిపారు.

ట్రంప్ ఆదేశాల ప్రకారం అధికారులు వలసదారులు ఉన్న ప్రాంతాలకు పెళ్లి వారి వద్ద ధ్రువీకరణ పత్రాలు లేనట్లయితే అక్రమ వలసదారులుగా ముద్ర వేస్తున్నారు, ఈ పరిణామాల వలన నిజమైన వలసలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిర్బంధించి విచారణ చేపట్టడం సమయం వృధా అని గతవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే దాంతో దేశ అధ్యక్షుడు జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు జడ్జి ఆమోదం తెలిపారు.

ఓరి దేవుడో.. ఇంత పెద్ద బీరువాను బైక్‌పై ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..