ఈ న్యాచురల్ హెయిర్ టానిక్ ను వాడారంటే వద్దన్నా మీ జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది!

దాదాపు ప్రతి అమ్మాయి తమ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగాలని కోరుకుంటుంది.అటువంటి జుట్టును( Hair ) పొందడానికి తెగ ఆరాటపడుతూ ఉంటుంది.

అయితే సరైన షాంపూ, కండీషనర్ తో పాటు జుట్టు పెరుగుదలకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉండాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ టానిక్( Natural Hair Tonic ) అందుకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ టానిక్ ను వారానికి ఒకసారి కనుక వాడితే మీరు వద్దన్నా మీ జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది.

మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ( Onion ) తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న‌ ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ జ్యూస్ కు అర కప్పు ఆలివ్ ఆయిల్( Olive Oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు తేనె ( Honey )వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

దాంతో మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. """/" / ఈ టానిక్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు.

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

టానిక్ అప్లై చేసుకున్న 40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ టానిక్ కనుక వాడితే హెయిర్ ఫాల్ త‌గ్గు ముఖం పడుతుంది.

అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది.

అలాగే ఈ న్యాచురల్ టానిక్ జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.హెయిర్ బ్రేకేజ్ ను అరికడుతుంది కాబట్టి ఒత్తైన దృఢమైన పొడవాటి జుట్టు ను కోరుకునే వారు తప్పకుండా ఈ హెయిర్ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందా.. బాలయ్య కొడుకుకే ఎందుకిలా?