ఈ హెర్బల్ ఫేస్ వాష్ ను రోజుకి ఒక్కసారి వాడితే ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
TeluguStop.com
మనకు మార్కెట్లో ఎన్నో రకాల ఫేస్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి.ఎవరి స్కిన్ టైప్ కు తగ్గట్టు వారు ఫేస్ వాష్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కొందరు చాలా ఖరీదైన ఫేస్ వాష్ ను వాడితే.మరి కొందరు కాస్త మీడియం బడ్జెట్ లో ఉండే ఫేస్ వాష్ ను వాడుతుంటారు.
అయితే మార్కెట్లో లభ్యం అయ్యే ఫేస్ వాష్ లు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెర్బల్ ఫేస్ వాష్ తో మీరు ఊహించని స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ ఫేస్ వాష్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
"""/" /
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పుదీనా పౌడర్( Mint Powder ), రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పౌడర్( Neem Powder ), రెండు టేబుల్ స్పూన్లు తులసి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్( Muleti Powder ) వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
అంతే మన హెర్బల్ ఫేస్ వాష్ సిద్ధం అయినట్టే.దీనిని ఎలా ఉపయోగించాలంటే తయారు చేసుకున్న ఫేస్ వాష్ పౌడర్ ను వన్ టేబుల్ స్పూన్ చొప్పున చేతిలోకి తీసుకుని వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకుని స్మూత్ గా రబ్ చేసుకోవాలి.
"""/" /
రెండు నిమిషాల పాటు ఫేస్ ను రబ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ హెర్బల్ ఫేస్ వాష్ ను వాడితే ముఖంపై మొటిమలు, మొండి మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
మృత కణాలు తొలగిపోతాయి.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.
బ్లాక్ హెడ్స్ మాయం అవుతాయి.పిగ్మెంటేషన్( Pigmentation ) సమస్య దూరం అవుతుంది.
మరియు క్లియర్ షైనీ అండ్ ఎట్రాక్టింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి మార్కెట్ లో లభ్యం అయ్యే కెమికల్ ఫేస్ వాష్ లు వాడే బదులు ఇంట్లోనే ఈ హెర్బల్ ఫేస్ వాష్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోండి.
పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!