వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!

సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.

దీని కారణంగా ఉన్న జుట్టు ఊడిపోతుంది.కానీ కొత్త జుట్టు మొలవదు.

కురులు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటాయి.దాంతో ఏం చేయాలో తెలియక తెగ వర్రీ అయిపోతుంటారు.

మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా.? జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

ఈ హెయిర్ టానిక్ ను వారానికి ఒకసారి వాడితే వద్దన్నా కూడా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.

మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఉల్లిపాయను( Onion ) తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసే కొన్ని మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్‌ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ ఉల్లిపాయ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ( Almond Oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన హెయిర్ టానిక్ అనేది సిద్ధమవుతుంది. """/" / ఈ హెయిర్ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే మీరు ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

"""/" / ఈ టానిక్ కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.ఉన్న జుట్టు ఊడిపోకుండా అడ్డుకట్ట వేస్తుంది.

హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మారుస్తుంది.చుండ్రు సమస్యను సంపూర్ణంగా దూరం చేస్తుంది.

మరియు జుట్టు ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.కాబట్టి ఎవరైతే ఒత్తైన, దృఢమైన, ఆరోగ్యమైన కురులను కోరుకుంటున్నారో వారు తప్పకుండా ఈ న్యాచురల్ హెయిర్ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

సాయి పల్లవి తో పాటు ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న హీరోయిన్స్ వీరే !