ఈ హెయిర్ స్ప్రే వాడితే చుండ్రు ఎంత తీవ్రంగా వున్నా మాయం అవుతుంది!

ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది చుండ్రు సమస్యతో సతమతం అవుతున్నారు.

షాంపూ సమయంలో చేసే పొరపాట్లు, తడి జుట్టును జడ వేసుకోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్, జుట్టులో మురికి.

మృత కణాలు పేరుకు పోవడం, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

ఈ సమస్య నుంచి బయట పడటం కోసం చాలా మంది ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ట్రీట్మెంట్ సైతం చేయించుకుంటారు.కానీ ఇంట్లోనే చాలా సులభంగా చుండ్రును వదిలించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ స్ప్రే అద్భుతంగా సహాయపడుతుంది.మరి లేటెందుకు ఆ హెయిర్ స్ప్రే ని ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక‌టిన్న‌ర గ్లాస్ వాటర్ ను పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

అనంతరం రైస్ వాటర్ ను స‌ప‌రేట్‌ చేసుకోవాలి.ఈ రైస్ వాటర్ లో గుప్పెడు వేపాకులు, నాలుగు టేబుల్ స్పూన్ల ఉసిరి కాయ ముక్కలు వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

"""/"/ ఇలా నానబెట్టుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా కలిపితే చుండ్రును తరిమికొట్టే స్ప్రే సిద్ధం అయినట్టే.

తల తో పాటు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ స్ప్రేను ఉపయోగించాలి.

గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ హెయిర్ స్ప్రే ను యూస్ చేస్తే చుండ్రు సమస్య అన్న మాటే అనరు.

ఒంటరిగా ఉన్నావా బాబూ.. స్కామర్‌తో ఆడేసుకున్న వాయిస్ ఆర్టిస్ట్.. వీడియో చూస్తే నవ్వాగదు..