కొబ్బరి నూనెను ఈ విధంగా వాడితే మీ జుట్టు నెల రోజుల్లో ట్రిపుల్ అవుతుంది!

జుట్టు ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, కాలుష్యం, ఒత్తిడి, ధూమపానం మద్యపానం అలవాట్లు, హార్మోన్ చేంజెస్, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి రోజురోజుకు పల్చబడుతుంటుంది.

ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఆగమాగం అయిపోతుంటారు.కానీ పరిష్కారం మీ ఇంట్లోనే ఉంది.

కొబ్బరి నూనె( Coconut Oil ).జుట్టు రాలడాన్ని తగ్గించి హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

"""/" / అయితే నేరుగా కొబ్బరి నూనెను రాసుకుంటే ఫలితాలు తక్కువగానే ఉంటాయి.

కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా కొబ్బరి నూనెను వాడితే మీ జుట్టు నెల రోజుల్లో ట్రిపుల్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి నూనెను ఎలా వాడాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కరివేపాకు, మూడు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek ) ఐదు నుంచి ఆరు లవంగాలు( Cloves ) వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

""img Src=" V" / ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె పోసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం తో పాటు రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తుంచి వేసుకోవాలి.

స్లో ఫ్లేమ్ పై పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఆయిల‌ను మరిగించాలి.

ఆపై స్టాఫ్ చేసి చల్లార బెట్టుకోవాలి.ఆయిల్ పూర్తిగా కూల్ అయిన అనంతరం ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ కు ఆయిల్ ను పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.మూడు రోజులకు ఒకసారి ఆయిల్ ను అప్లై చేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

కురులు ఒత్తుగా పెరుగుతాయి.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.త‌ల‌లో దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఏమైనా ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.

నీతో నాది గత జన్మబంధమంటూ .. ఎన్ఆర్ఐ మహిళపై యోగా టీచర్ అత్యాచారం