స్మార్ట్ వాచ్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి!

నిన్న మొన్నటి వరకు స్మార్ట్‌వాచ్‌ని కాస్త డబ్బులు ఎక్కువగా వున్నవారే వాడతారు అనే ఆలోచన ఉండేది.

కానీ ఇపుడు స్మార్ట్ ఫోన్స్ వలె స్మార్ట్‌వాచ్‌ కూడా కామన్ విషయం అయిపోయింది.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నకొద్దీ వినియోగదారుల మైండ్ సెట్ మారుతోంది.స్మార్ట్‌ గా ఆలోచిస్తున్నారు.

ఇపుడు ఫోన్ మాదిరి నోటిఫికేషన్ అప్‌డేట్‌లను ఈ గడియారం ఇచ్చేస్తోంది.అలాగే మన జీవితాన్ని రక్షించడంలో కూడా స్మార్ట్ వాచెస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి.

అయితే స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేసే విషయంలో కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

"""/"/ అందులో ముందుగా మీరు ఎంపిక చేసుకోబోయేది సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కలిగి ఉండాలి.

కొన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 24 రోజుల వరకు వస్తాయి.

రోజంతా వాటి బ్యాటరీ వినియోగం ఉండడం వలన కొన్ని కంపెనీలు ఆ దిశగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.

ఈ వాచెస్ మనకు అనేక రకాలుగా ఉపయోగ పడతాయి.కాల్‌లకు సమాధానమివ్వడం, సందేశాలను తనిఖీ చేయడం మరియు ప్రత్యుత్తరం ఇవ్వడం, ప్రయాణంలో సంగీతాన్ని ప్రసారం చేయడం మరియు NFC సాంకేతికతతో ప్రయాణంలో చెల్లింపులు చేయడం వంటి కారణాలతో వాటి ఛార్జ్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది.

అందుకనే ఈ విషయాన్ని గుర్తించాలి. """/"/ ఇక మరీ ముఖ్యంగా మీరు కొనుగోలు చేస్తున్న స్మార్ట్‌వాచ్ మీ రోజువారీ హృదయ స్పందన రేటు, ఒత్తిడి స్థాయి, నిద్ర విధానం వంటి వాటిపైన విశ్లేషణ చేస్తుందా లేదా? అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.

ఆ ఆప్షన్ లేకపోతే అలాంటివి అవాయిడ్ చేయడం ఉత్తమం.ఆ తరువాత యాప్స్ ని చెక్ చేసుకోండి.

మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లు లేదా స్ట్రీమ్ టీవీ షోలకు కనెక్ట్ చేయగల స్మార్ట్‌వాచ్ అయితే అదనపు బోనస్ గా పరిగణించాలి.

మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇవి మీకు ఉపశమనాన్ని చేకూరుస్తాయి.

Kadiyam Srihari : రేపు కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి