రోజు నైట్ ఈ రోజ్ సీరం ను వాడితే మీ స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవడం గ్యారంటీ!

తమ ముఖ చర్మం ఎటువంటి మొటిమలు మచ్చలు( Acne Scars ) లేకుండా గ్లోయింగ్ గా మరియు అందంగా మెరిసిపోవాలని కోరుకునే వారు ఎందరో ఉంటారు.

ఇలాంటి వారు స్కిన్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు.రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.

అయితే రసాయనాలతో కూడిన స్కిన్ ప్రొడక్ట్స్ ( Skin Products )కంటే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చర్మ సంరక్షణ అద్భుతంగా తోడ్పడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ రోజ్ సీరం ను రోజు నైట్ వాడితే మీ స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవడం గ్యారంటీ.

అదే సమయంలో మరెన్నో చర్మ ప్రయోజనాలు కూడా పొందుతారు. """/" / మరింతకీ ఆ రోజ్ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద ఆకు ( Aloe Vera Leaf )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్, ఒక కప్పు గులాబీ రేకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్( Glycerin ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E Oil )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన సీరం అనేది రెడీ అవుతుంది. """/" / ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మరియు మెడకు తయారు చేసుకున్న రోజ్ సీరం ను అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.

ఈ సీరం చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది.ఉదయానికి స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్స‌హిస్తుంది.

అలాగే ఈ రోజ్ సీరం మొటిమలకు మచ్చలకు చెక్ పెడుతుంది.డ్రై స్కిన్ సమస్యను దూరం చేస్తుంది.

చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ సీరంను తయారుచేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

పక్షికి సీపీఆర్ చేసి బతికించిన కేరళ వ్యక్తి.. నెటిజన్లు ఫిదా..