బట్టతలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఇది.. వారానికి ఒక్కసారి వాడిన చాలు! TeluguStop.com
ఇటీవల కాలంలో చాలా మంది పురుషులను మదన పెట్టే సమస్యల్లో బట్టతల( Baldness ) ఒకటి.
జుట్టు కాస్త ఎక్కువగా రాలుతుంది అంటే చాలు మగవారిలో టెన్షన్ మొదలవుతుంది.ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని నిత్యం భయపడుతూ ఉంటారు.
కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ బట్టతలకు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ ఆయిల్ ని( Oil ) వాడిన చాలు.మీ జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.
అలాగే అరకప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు బిర్యానీ ఆకులు, ఐదు నుంచి ఎనిమిది దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చిన్న మంటపై ఉడికించాలి.
"""/" /
దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇక ఈ ఆయిల్ ను ఎలా వాడాలంటే.చేతితో స్కాల్ప్ కు( Scalp ) ఆయిల్ ను అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను రాసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.
"""/" /
వారానికి ఒక్కసారి ఈ ఆయిల్ ని వాడిన చాలు బట్టతల భయమే అక్కర్లేదు.
ఈ ఆయిల్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.హెయిర్ ఫాల్( Hairfall ) సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.
బట్టతల వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.కాబట్టి బట్టతల వస్తుందేమో అని భయపడుతున్న పురుషులు మరియు బట్టతల రాకుండా ఉండాలని కోరుకునే పురుషులు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడండి.
హెచ్ 1 బీ దరఖాస్తుదారులకు అలర్ట్ .. ఇకపై అడ్రస్ , బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిందే