నెలకు రెండుసార్లు ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే బట్టతల మీ వంక కూడా చూడదు!
TeluguStop.com
ఇటీవల కాలంలో పురుషులను భయపెడుతున్న సమస్యల్లో బట్టతల( Bald ) ఒకటి.కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, ఒత్తిడి, మారిన జీవనశైలి, కాలుష్యం తదితర కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే బట్టతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.
అయితే బట్టతల వచ్చాక బాధపడుతూ కూర్చోవడం కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టోనర్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ టోనర్ ను నెలకు రెండుసార్లు కనుక వాడితే బట్టతల మీ వంక కూడా చూడదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అందులో నాలుగు రెబ్బలు వేపాకు( Neem ) వేయాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్ డ్రై రోజ్మేరీ ఆకులు( Dry Rosemary Leaves ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
"""/" /
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) కలిపి బాగా మిక్స్ చేసుకుంటే మన టోనర్ అనేది సిద్ధం అవుతుంది.
ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.
ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.
"""/" /
గంట తర్వాత తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
నెలకు రెండు సార్లు ఈ న్యాచురల్ టోనర్ ను కనుక వాడితే హెయిర్ ఫాల్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.కాబట్టి బట్టతలకు దూరంగా ఉండాలి అనుకుంటున్న పురుషులు తప్పకుండా ఈ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.