ఈ హోమ్ మేడ్ సీరంను వాడితే మీ జుట్టు మూడింతలు పెరుగుతుంది!
TeluguStop.com
ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడనివారు ఉండరు.స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా తమ జుట్టు ఒత్తుగా ఉండాలని భావిస్తుంటారు.
కానీ ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల రోజురోజుకు జుట్టు( Hair ) విపరీతంగా ఊడిపోతుంది.
దాంతో ఒత్తుగా ఉండాల్సిన జుట్టు పలుచగా మారిపోతుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంను వాడితే మీ జుట్టు మూడింతలు పెరగడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
"""/"/
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు లేదా మూడు ఎండిన మందార పువ్వులు( Hibiscus ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ ముక్కలు వేసి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.
జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్ధం అయినట్టే.
ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
"""/"/
ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.
సీరం ను అప్లై చేసుకున్న మరుసటి రోజు మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ సీరం ను వాడితే హెయిర్ గ్రోత్( Hair Growth ) అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు మూడింతలు పెరుగుతుంది.జుట్టు ఒత్తుగా పెరగాలని కోరుకునేవారు పలుచటి జుట్టుతో బాధపడే వారు తప్పకుండా ఈ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
అల్లు అర్జున్ తో తనని తాను పోల్చుకున్న పల్లవి ప్రశాంత్… కాస్త ఓవర్ అయిందంటూ?